Breaking News

ఇప్పుడు విజయవాడలో కాకినాడ “సుబ్బయ్య” గారి హోటల్ ప్రారంభం…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కాకినాడ లో ప్రసిద్ధి గాంచిన “సుబ్బయ్య గారి హోటల్” ను విజయవాడలో ప్రారంభించడం అభినందననీయమని సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. ఆదివారం రామమందిరం రోడ్డు, ఆంధ్ర హాస్పిటల్ ఎదురుగా కాకినాడ వారి “సుబ్బయ్య” గారి హోటల్ ను సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ కాకినాడ వెళితే సుబ్బయ్య గారి హోటల్ చాలా ఫేమస్ అని, ఆంధ్ర భోజనం చేయాలంటే సుబ్బయ్య గారి హోటల్ తరువాతేనని కొనియాడారు. నాణ్యమైన ఆహారం అందించడంలో తనదైన ముద్రవేసుకున్న సుబ్బయ్య” గారి హోటల్ అంచెలంచెలుగా దినాభివృద్ధి చెందుతూ మన విజయవాడకి రావడం శుభపరిణామని తెలిపారు. సుబ్బయ్య గారి హోటల్ నిర్వాహకులు నీలి కృష్ణ మోహన్, కొత్తూరి రాజ శేఖర్ లు మాట్లాడుతూ పేద ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో సంపూర్ణ భోజనం అందించాలనే ఉద్దేశ్యంతోనే సుబ్బయ్య గారి హోటల్ ను ప్రారంభించారని, ఆంధ్ర రుచులతో విభిన్న రకాల వంటకాలతో పూర్తి శాకాహార భోజనం అందిస్తున్నట్లు వివరించారు. తమ హోటల్ కి వస్తే అత్తారింటికి వచ్చినట్లేనని కడుపు నిండేవరకు కొసరి..కొసరి వడ్డిస్తామని ఎక్కడ రాజీపడేది లేదన్నారు. తమ హోటల్ లో నార్త్ ఇండియన్ ఫుడ్ ఐటమ్స్, బిర్యానీలు, ఇంకా అనేక రకాల పచ్చళ్ళు, అన్ని రకాల స్వీట్స్ కనీవినీ ఎరుగని రీతిలో ఉన్నాయని తెలిపారు. శాఖాహార భోజనప్రియులకు ఒక్కసారి తమ హోటల్ కు విచ్చేస్తే అసలైన సిసలైన ఆంధ్ర భోజనం ఎలా ఉంటుందో రుచిచూపిస్తామని తెలిపారు. ప్రారంభంలో ఆంధ్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ పి.వి రమణ మూర్తి, సుబ్బయ్య గారి హోటల్ కుటుంబ సభ్యులు, ప్రముఖులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *