Breaking News

అధికారం లేకపోతే తెలుగుదేశం పార్టీ బ్రతకలేని పరిస్థితి…

-క్లీన్ ఆంధ్రప్రదేశ్(క్లాప్) కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారం లేకపోతే తెలుగుదేశం పార్టీ, ఎల్లో మీడియా బ్రతకలేకుండా ఉన్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు విమర్శించారు. క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా స్థానిక కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి 62వ డివిజన్ పటేల్ నగర్ లో ఇంటింటికీ చెత్త సేకరణ డబ్బాలను పంపిణీ చేశారు. గార్భేజ్ ఫ్రీ నగరంగా విజయవాడను తీర్చిదిద్దడమే తమ ప్రధాన కర్తవ్యమని ఈ సందర్భంగా వెల్లడించారు. వాతావరణానికి, ప్రజలకు హానికరమైన వ్యర్థాల తొలగింపులో అత్యుత్తమ విధానాలు పాటించాలని ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. ఎప్పటికప్పుడు చెత్తను తొలగించడమే కాకుండా.. ఆయా ప్రాంతాలలో దుర్వాసన రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పారిశుద్ధ్య నిర్వహణతో పాటు.. వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలపై నిరంతరం దృష్టిపెట్టాలన్నారు. ముఖ్యంగా ఎక్కడా మురుగునీరు నిల్వ లేకుండా చూడాలన్నారు. ప్రజలు కూడా వ్యక్తిగతంగా పారిశుద్ధ్య కార్యక్రమాలలో భాగస్వామ్యం పంచుకుంటేనే నగరం మరింత సుందరీకరణ దిశగా అడుగులు వేస్తుందన్నారు. చెత్తను వేరు చేసి అందించేలా ఆయా ఇంటి యజమానులకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు. పేదరిక నిర్మూలనే ప్రధాన అజెండాగా రాష్ట్రంలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుస్థిర పాలన అందిస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రానికి తెలుగుదేశం అవసరం కానీ, చంద్రబాబు అవసరం కానీ ఏమాత్రం లేదని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడు నెలల్లోనే రాష్ట్రం అప్పులపాలైందని మొదలు పెట్టి.. నేటికీ అదే పాట పాడుతూ ప్రజలలో అభాసుపాలవుతున్నారని వ్యాఖ్యానించారు. తెలుగుదేశం నాయకులు చెప్పే అవాస్తవాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవడంతో.. బురదచల్లే కార్యక్రమాలకు ఎల్లో మీడియాను వేదిక చేసుకుంటున్నారని విమర్శించారు. చివరకు ప్రతిపక్ష పాత్ర పోషించడంలోనూ తెలుగుదేశం ఘోర వైఫల్యం చెందిందని.. పొద్దుపోక చంద్రబాబు భజన పాటలతో ఆ పార్టీ నాయకులు కాలం వెళ్ళదీస్తున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో నాయకులు అలంపూర్ విజయ్, రామిరెడ్డి, హైమావతి, రెడ్డెమ్మ, గ్రేసీ, వెంకట్, శ్రీను, సాయి, సాంబయ్య, నాగేశ్వరరావు, రాజారెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *