Breaking News

బాధిత యువతి కుటుంబ సభ్యులను పరామర్శించిన పోతిన వెంకట మహేష్…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యాచారానికి గురైన యువతిని మరియు వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ బాధిత యువతి కుటుంబం పట్ల ప్రభుత్వం కనీస మానవత్వం చూపించలేకపోయిందని, 50 లక్షల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తే కంటితుడుపు చర్యగా కేవలం పది లక్షల రూపాయల చెక్కు అందజేసి ప్రభుత్వం జారుకుందని, సీఎం కనీసం ఈ ఘటనపై సక్రమంగా స్పందించ లేక పోయారని, మహిళల రక్షణ మరియు సమస్యలపై జగన్ ప్రభుత్వం ఉన్నా చిత్తశుద్ధి ఎంటో మరొకసారి రుజువైందని, అదేవిధంగా ఈ సంఘటన కొత్త ప్రభుత్వ ఆస్పత్రిలో జరిగితే ఇంతవరకు అక్కడ అధికారులపై చర్యలు తీసుకోలేదని, సెక్యూరిటీ సంస్థపై కూడా చర్యలు తీసుకోలేక పోయారని, నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే బాధిత కుటుంబానికి యాభై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఆమె తల్లి కి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముగ్గురు నిందితులకు కఠిన శిక్షలు విధించాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం లో మహిళలకు రక్షణ కరువైందని అన్నారు. మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ మహిళలపై దురాగతాలు జరిగిన తర్వాత పరామర్శించడానికి మాత్రమే పరిమితమయ్యారని, ముందస్తు రక్షణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారని, విజయవాడ నగరంలో మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్చార్జి దేవినేని అవినాష్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి 36 గంటల సమయం కావాలా, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించి తిరిక లేని ఇటువంటి పనికిమాలిన ప్రజాప్రతినిధులును మరియు వైఎస్ఆర్సిపి నాయకుల నిజస్వరూపాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. పాత ప్రభుత్వ ఆసుపత్రి సందర్శించిన వారిలో సెంట్రల్ నియోజకవర్గ నాయకులు బొలిశెట్టి. వంశీకృష్ణ, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి సంజీవరావు, విజయవాడ నగర ఉపాధ్యక్షులు సోమనాథమ్, 60 డివిజన్ అధ్యక్షులు కుప్పల. శ్రీనివాస్, ముద్దన.స్టాలిన్ శంకర్, రామా నాయుడు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *