Breaking News

విద్యుత్ కొరతను అధిగమిస్తాం… : మంత్రి, పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి

-మళ్ళి చెప్తున్నా ఈ సమస్య తాత్కాలికమే
-ఆంధ్ర ప్రదేశ్ లో మే మొదటి వారానికి విద్యుత్ సరఫరా సాధారణ స్థాయికి చేరే అవకాశం
-బొగ్గు లభ్యత పెంచడం , విద్యుత్ కొరత అధిగమించడం పై నిరంతర పర్యవేక్షణ కోసం కోర్ మేనేజ్మెంట్ టీం ఏర్పాటు
-కరెంటు కొరత సమస్య పై పై నిరంతరం స్పందిస్తాం.. తక్షణ చర్యల తీసుకుంటాం
-దేశీయంగా , అంతర్జాతీయగా ఏర్పడిన బొగ్గు కొరతే విద్యుత్ కొరత కు ప్రధాన కారణం .
-అనేక రాష్ట్రాల్లో అడుగంటిన బొగ్గు నిల్వలు
-ఆయా రాష్ట్రాల్లో థర్మల్ ప్లాంట్లలో 2 నుంచి 5 రోజులకే సరిపడిన బొగ్గు లభ్యత
-బొగ్గు కొరత కారణంగా దేశ వ్యాప్తంగా అనేక థర్మల్ ప్లాంట్లలో తగ్గిన విద్యుత్ ఉత్పత్తి
-బహిరంగ మార్కెట్ లోనూ విద్యుత్ తగినంత దొరకని పరిస్థితి
-దీనివల్ల బహిరంగ మార్కెట్లో గత 10 ఏళ్ల తో పోలిస్తే గరిష్టంగా యూనిట్ కు 12-20 కు చేరిన విద్యుత్ ధర
-పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల లోనూ భారీగా విద్యుత్ కొరత –తప్పని లోడ్ షెడ్డింగ్
-గృహ , వ్యవసాయ విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి
-2018-19 లో 63605 మిలియన్ యూనిట్ల నుండి 2021-22 లో 68905 మిలియన్ యూనిట్లకు చేరిన విద్యుత్ డిమాండ్
-అన్ని రంగాలకు అవసరమైన విద్యుత్ సరఫరా చేయటమే ప్రభుత్వ లక్ష్యం — ఇంధన శాఖ మంత్రి , పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
-విద్యుత్ కొరత సమస్యను త్వరలోనే అధిగమిస్తాం
-ఉష్ణోగ్రత పెరుగుతోంది .. డిమాండ్ పెరుగుతోంది .. అప్రమత్తంగా ఉండండి- అధికారులకు ఇంధన శాఖ మంత్రి ఆదేశం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తీవ్రమైన బొగ్గు కొరత కారణంగా రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ కొరతను మే మొదటి వారం కల్లా అధిగమించగలుగుతామని ఆంధ్ర ప్రదేశ్ విద్యుత్ సంస్థలు గట్టి నమ్మకం తో ఉన్నాయి. రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆదేశాల మేరకు బొగ్గు లభ్యత పెంచడం, విద్యుత్ కొరతను అధిగమించడం తదితర అంశాలను నిరంతరం పర్యవేక్షించేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఒక కోర్ మేనేజ్మెంట్ టీం ను ఏర్పాటు చేసింది. పరిశ్రమలకు కూడా పూర్తి స్థాయిలో విద్యుత్ సరఫరా పునరుద్దరించాలనే లక్ష్యం తో విద్యుత్ సంస్థలు అహర్నిశలు కృషి చేస్తున్నాయి.
అధికారులు తెలిపిన వివరాల ప్రకారం దేశ వ్యాప్తంగా దాదాపు అన్ని ప్రధాన రాష్ట్రాలు తీవ్రమైన విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. దేశంలో ఉన్న విద్యుత్ అవసరాలలో 50 శాతం పైగా బొగ్గు ఆధారిత థర్మల్ విద్యుత్ ప్లాంట్లు తీరుస్తున్నాయి. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లోని థర్మల్ విద్యుత్ ప్లాంట్లలో కేవలం 2 నుంచి 5 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. నిబంధనలు ప్రకారం థర్మల్ ప్లాంటులో 24 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉండాల్సి ఉంది. ఈ దృష్ట్యా పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాలు సైతం భారీగా విద్యుత్ కొరతను ఎదుర్కొంటున్నాయి. విద్యుత్ సరఫరా పై ఆంక్షలు విధించాయి.
కోవిడ్ పరిస్థితులు , భారీ వర్షాలు , బొగ్గు ఉత్పత్తి పై ప్రభావం చూపుతున్నాయి. మరో వైపు రష్యా- యుక్రెయిన్ దేశాల మధ్య యుద్ధ ప్రభావం అంతర్జాతీయంగా కూడా బొగ్గు కొరత పై తీవ్ర ప్రభావం చూపుతుంది . దీని వల్ల బొగ్గు ధరలు గతం లో ఎన్నడూ లేనంత రికార్డు స్థాయి కి చేరుకున్నాయి. బొగ్గు దిగుమతి చాలా కష్టసాధ్యంగా మారింది. ఈ కారణంగా దేశ వ్యాప్తంగా అనేక థర్మల్ ప్లాంట్ల లో విద్యుత్ ఉత్పాదన గణనీయంగా పడిపోయింది. ఫలితంగా అన్ని రాష్ట్రాలు బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు క్యూ కడుతున్నాయి. దీనితో డిమాండ్ సరఫరా మధ్య అంతరం బాగా పెరిగిపోయింది. విద్యుత్ ఎక్సచెంజీలలో(exchange) గత 10 ఏళ్లలో ఎన్నడూ లేనంత గా యూనిట్ ధర భారీగా రూ 12 నుంచి రూ 20 కు పలికింది. మన రాష్ట్ర విద్యుత్ సంస్థలు కూడా పీక్ అవర్స్ లో ఇదే ధర వద్ద విద్యుత్ కొనాల్సిన తప్పని పరిస్థితి ఏర్పడింది.
కోవిడ్ కాస్త తగ్గుముఖం పట్టేక ఆర్థిక వ్యవస్థ పుంజుకోవటం , వేసవి కాలం రావడం తో విద్యుత్ డిమాండ్ అమాంతం పెరిగింది. మన రాష్ట్రంలో 2018-19 లో 63605 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉండగా ప్రస్తుతం అది 68905 మిలియన్ యూనిట్లకు చేరింది. అంటే గతం లో ఎన్నడూ లేని విధంగా 8. 33 శాతం చొప్పున విద్యుత్ డిమాండ్ పెరగగా , అదే సమయంలో బొగ్గు లభ్యత భారీగా పడిపోయింది. విద్యుత్ కొరత తీవ్రతరం కావటానికి ఇదే ప్రధాన కారణంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల నేపథ్యంలోనూ మన రాష్ట్రంలో గృహ అవసరాలకు, వ్యవసాయానికి 7 గంటలు ఉచిత విద్యుత్ సరఫరా ను ఇబ్బంది తలెత్తకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు విద్యుత్ సంస్థలు రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. అయితే విద్యుత్ కొరత అనేది తాత్కాలికమేననీ , మే నెల మొదటి వారాని కల్లా దీనిని అధిగమిస్తామన్న ఆశాభావాన్ని రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వ్యక్తం చేసారు.
విద్యుత్ సంస్థల ఉన్నతాధికారులతో జరిగిన టెలీకాన్ఫెరెన్స్ లో మంత్రి మాట్లాడుతూ గృహ, వ్యవసాయ వినియోగానికి నాణ్యమైన విద్యుత్ సరఫరా అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తప్పని విధి లేని , అనివార్య పరిస్థితుల్లోనే పరిశ్రమలకు విద్యుత్ సరఫరా పై ఆంక్షలు విధించటం జరిగిందన్నారు . గత ఏడాది అక్టోబర్ 2021 లో కూడా తీవ్ర మైన బొగ్గు కొరత ఏర్పడినప్పటికీ రాష్ట్రంలోని విద్యుత్ కొరత రాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది . అసాధ్యాలను సుసాధ్యాలు చేయగలిగిన ముఖ్యమంత్రి నాయకత్వంలో రాష్ట్ర విద్యుత్ రంగం ప్రస్తుత విద్యుత్ కొరతను అధిగమించేందుకు తీవ్ర స్థాయిలో ప్రయత్నిస్తోందన్నారు. అంతిమ విజయం సాధిస్తుందన్నారు. “మళ్ళి చెప్తున్నా విద్యుత్ కొరత సమస్య తాత్కాలికమే.. ఈ పరిస్థితిని ఖచ్చికంగా అధిగమిస్తాం. కరెంటు కొరత సమస్య పై నిరంతరం స్పందిస్తాం. ఎప్పటికపుడు తక్షణ చర్యలు తీసుకుంటాం. బొగ్గు కొరతకు సంబంధించి జాతీయంగా , అంతర్జాతీయంగా ఏర్పడిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో అన్ని రంగాలకు కావాల్సినంత విద్యుత్ సరఫరా జరిగేలా చర్యలు తీసుకోబోతున్నాం . ప్రస్తుతం తాత్కాలికంగా ఏర్పడిన విద్యుత్ కొరత సమస్యను ప్రజలు అర్ధం చేసుకుంటారన్న నమ్మకం మాకు ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజల సమస్యల పై ఎప్పుడు వెనుకంజ వేయలేదు. జాతీయంగా, అంతర్జాతీయంగా కరోనా విజ్రంభించి ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైన పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏ కుటుంబానికి లోటు లేకుండా చేసారు . ఆర్థికంగా కూడా తోడ్పడ్డారు. ఏ కుటుంబము ఏ విధంగా ఇబ్బంది పడకుండా వేలాది కోట్ల రూపాయలు వెచ్చించి ఆర్థికంగానూ ఆదుకున్నారు” అని మంత్రి తెలిపారు.
వేసవి ఉష్ణోగ్రతలు పెరగడం తో విద్యుత్ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న పంటలను కాపాడుకునేందనుకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని , ఈ దృష్ట్యా వ్యవసాయ విద్యుత్ సరఫరా పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి ఆదేశించారు. విద్యుత్ కొరత కారణంగా ఒక ఎకరం పంట కూడా దెబ్బ తినకూడదన్నారు. రైతుల సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని తెలిపారు.
అలాగే పరిశ్రమలకు విద్యుత్ సరఫరా పై విధించిన ఆంక్షలు కూడా మే మొదటి వారానికి సడలించే లక్ష్యం తో పనిచేయాలని విద్యుత్ సంస్థల అధికారులను ఆదేశించాం అన్నారు . విద్యుత్ కొరత దేశ వ్యాప్తంగా నెలకొందని , దీనికి ఆంధ్ర ప్రదేశ్ ఎం మినహాయింపు కాదన్నారు. ఎంత ఖర్చు అయినా సరే బహిరంగ మార్కెట్ లో విద్యుత్ కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అయితే తగినంత విద్యుత్ లభ్యత లేకపోవడమే ప్రధాన సమస్యగా మారిందన్నారు.
రాష్ట్రంలో ఈ నెల 23 న డిస్కాములు 208 మిలియన్ యూనిట్ల విద్యుత్ ను సరఫరా చేసాయి . గత ఏడాది అదే రోజున 192 మిలియన్ యూనిట్ల సరఫరా జరిగింది. గత ఏడాది ఏప్రిల్ లో పీక్ డిమాండ్ 11570 మెగావాట్ ఉండగా , ఈ ఏడాది అదే సమయానికి 12293 మెగావాట్లకు చేరింది.
విద్యుత్ రంగానికి సంబంధించి అనేక అంశాల పై ప్రతి వారం నిర్వహించే సమీక్షల్లో భాగంగా , ఏ పీ ట్రాన్స్కో ప్రాజెక్టుకు , నిర్వహణ పై రేపు (సోమవారం) విద్యుత్ శాఖ మంత్రి నేరుగా విద్యుత్ అధికారులతో సెక్రటేరియట్ లో చర్చించనున్నారు
మే నుండి అక్టోబర్ నెలల మధ్య విద్యుత్ డిమాండ్ అధికంగా ఉండే దృష్ట్యా తగిన ప్రణాళిక ను విద్యుత్ సంస్థలు రూపొందిస్తున్నట్లు ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్ మంత్రి దృష్టికి తీసుకొచ్చారు .
ఈ టెలీకాన్ఫెరెన్స్ లో జె ఎం డీ ఏ పీ ట్రాన్స్కో , ఐ పృథ్వి తేజ్ , డిస్కామ్ సి మీ డీ లు , హెచ్ హరనాథ రావు , జ్ పద్మ జనార్ధన రెడ్డి , కే సంతోష రావు , ఏ పీ టాన్స్కో గ్రిడ్ డైరెక్టర్ ఏ వీ కె భాస్కర్ తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *