Breaking News

కడపలో జరిగే రాష్ట్ర కళా ఉత్సవాలకు తరలిరావాలి…

-పాలకుల విధానాలపై కళా ప్రదర్శనలు ఉండాలి…
-ప్రజానాట్యమండలి రాష్ట్ర సమితి పిలుపు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
2022 మే 25 నుంచి 31 వరకు కడపలో జరిగే ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు, కళా ఉత్సవాలకు అన్ని జిల్లాల నుండి కళాకారులు తరలిరావాలని ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. బుధవారం హనుమాన్‌పేటలోని దాసరి భవన్‌లో సంఘ అధ్యక్షులు గని అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రజా నాట్య మండలికి ఘనమైన చరిత్ర ఉందని ప్రజలను చైతన్య పరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తున్నది. ప్రజల జీవన స్థితిగతులు పాలకుల మోసపూరిత విధానాలపై ఎప్పటికప్పుడు నూతన కళారూపాలు, పాటల ద్వారా ప్రజల్లో చైతన్యాన్ని కలిగించిన చారిత్రాత్మకమైన ప్రజానాట్యమండలి రాష్ట్రస్థాయి కళా ఉత్సవాలు కనీవినీ ఎరుగని రీతిలో జరగబోతున్నాయన్నారు. పి.జే.చంద్రశేఖర రావు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఇతివృత్తంగా తీసుకొని అనేక రకాల కొత్త కళారూపాలతో కడపలో జరిగే మహాసభలకు కళాకారులు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్ర నాయక్‌ మాట్లాడుతూ రాష్ట్ర మహాసభలుచ, కళా ఉత్సవాలకు వేలాది మంది తరలి రావడానికి ఉత్సాహం చూపుతున్నారని అన్ని జిల్లాల నుండి గ్రామీణ, జానపద, పౌరాణిక కళాకారులు అధిక సంఖ్యలో రానున్నారని ఈ సందర్భంగా తెలిపారు. సందర్భంగా కళా రంగాల ప్రముఖులు ముఖ్యంగా సినిమా రంగం నుండి అతిథులు పాల్గొంటున్నారన్నారు. సాహిత్య కళా రంగాలకు సంబంధించిన ప్రముఖులు పాల్గొని కళాకారులను ఉత్తేజ పరుస్తారన్నారు. శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు కళాకారులు హాజరౌతున్నారన్నారు. రాయలసీమ సాహిత్యం కళలతోపాటు కరువుపై కూడా అనేక రకాల కళారూపాలు ప్రదర్శించబోతున్నారన్నారు. ఈ సమావేశంలో ఆర్‌. పిచ్చయ్య, లక్ష్మణరావు, సీతారాం ప్రసాద్‌, రాజేశ్వరరావు, నజీర్‌, భాస్కర్రావు బి. రామకృష్ణ, రామారావు, ఆర్‌. రామకృష్ణ, గుర్రప్ప తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *