Breaking News

నగరంలో పారిశుధ్య నిర్వహణ తీరు పరిశీలన…

-రోడ్ల పై చెత్త పడవేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి
-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా శనివారం 23 మరియు 25వ శానిటరీ డివిజన్ పరిధిలో పారిశుధ్య నిర్వహణలో భాగంగా మైక్రో పాకెట్ ప్రకారం రోడ్లు శుభ్రపరచుట మరియు డోర్ టు డోర్ చెత్త సేకరణ విధానము అడిగితెలుసుకొని పలు ఆదేశాలు ఇచ్చారు. ముందుగా 23వ డివిజన్ పరిధిలోని సి.వి.ఆర్ మున్సిపల్ హైస్కూల్ నందు నిర్మాణములో ఉన్న తరగతి గదుల నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించి ఎన్ని క్లాసు రూమ్లు నిర్మిస్తున్నది ఎప్పటికి పూర్తి అయితాయి తదితర వివరాలు అడిగితెలుసుకొని నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయునట్లుగా చూడాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సి.వి.ఆర్ స్కూల్ రోడ్ నందు రోడ్లు శుభ్రపరచు విధానము పరిశీలించిన సందర్భంలో కోటు వద్ద డెబ్రిష్ దానిపై చెత్త మరియు వ్యర్దములు ఉండుట గమనించి చెత్తను తొలగించుట మరియు సదరు డెబ్రిష్ ను తొలగింపుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

తదుపరి 25వ శానిటరీ డివిజన్ పరిధిలోని ఏలూరు రోడ్, సీతారామపురం, కొత్తవంతెన తదితర ప్రాంతాలలో ప్రధాన రోడ్లు శుభ్రపరచు విధానము మరియు మైక్రో పాకెట్ ప్రకారం ఆయా ప్రదేశాలలో అంతర్గత రోడ్లు శుభ్రపరచుట మరియు నివాసాల నుండి చెత్త సేకరణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంలో పలు చోట్ల రోడ్ల పై చెత్త మకామ్ లు ఉండుట గమనించి ఇంటింటి చెత్త సేకరణ జరుగుతున్నప్పటికీ స్థానికులు ఎవరు రోడ్లపై చెత్త పడవేయకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు.

పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వి.శ్రీనివాస్, డి.వై.ఇ.ఓ ఇన్ ఛార్జ్ కె.వి.వి.రాజు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతబాయి, హెల్త్ ఆఫీసర్ డా.రామకోటీశ్వరరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఎల్‌బీఆర్‌సీఈలో పాఠశాలలు మరియు కళాశాల విద్యాసంస్థల బస్సు డ్రైవర్లకు రిఫ్రెషర్ ట్రైనింగ్ కార్యక్రమం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : స్థానిక లకిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో రవాణా శాఖ వారి అధ్యర్యంలో విద్యాసంస్థల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *