-స్వయంగా వారి కార్యాలయాలను శుభ్రం చేసుకొన్న
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పరిసరాల పరిశుభ్రత అందరి భాద్యత ప్రతి రోజు మన ఇంటిని ఏవిధంగా శుభ్రం చేసుకుంటామో అదే విధంగా మన పని చేసే కార్యాలయాలను కూడా శుభ్రం చేసుకోవలసిన భాద్యత మనది అని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి పేర్కొన్నారు. స్వచ్చ్ సర్వేక్షణ్ – క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమములో భాగంగా శనివారం నగరపాలక సంస్థ కార్యాలయాలో అన్ని విభాగములలో శుభ్రత కార్యక్రమములకు శ్రీకారం చుట్టారు. ముందుగా నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ వారి వారి కార్యాలయాలను శుభ్రం చేసుకొన్నారు. క్లిన్ & గ్రీన్ కార్యక్రమములో భాగంగా కార్యాలయము నందలి అన్ని విభాగములలో సిబ్బంది చేపట్టిన శుభ్ర పనులను మేయర్ మరియు కమిషనర్ స్వయంగా పర్యవేక్షించారు.
పరిసరాల పరిశుభ్రత – మనందరి భాద్యత
ఆరోగ్యకరమైన వాతావరణంలో ప్రజలకు సేవలు అందించాలి ….. మేయర్ రాయన భాగ్యలక్ష్మి
రాష్ట్ర ముఖ్యమంత్రి వై యస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రెండు రోజుల పాటు క్లీన్ ఆంధ్రప్రదేశ్ (CLAP) – స్వచ్చ్ ఆంధ్రప్రదేశ్ ప్రోగ్రామ్ లో భాగంగా శుక్రవారం డివిజన్లలో పరిసరాల పరిశుభ్రత, ప్లాస్టిక్ నివారణపై ప్రజలకు అవగాహన కల్పించేలా ర్యాలి లను నిర్వహించుట జరిగిందని అన్నారు. అదే విధంగా నేడు నగరపాలక సంస్థ కార్యాలయంలో శుభ్రత కార్యక్రమము చేపట్టినట్లు, ప్రతి శనివారం ఉదయం వేళలలో సిబ్బంది వారి వారి విభాగములను శుభ్రపరచుకొనే విధంగా ఆదేశాలు ఇవ్వటం జరిగిందని అన్నారు. కార్యాలయానికి అనేక మంది ప్రజలు నిత్యం వివిధ పనుల మీద వస్తుంటారని, వారికీ ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించి సేవలు అందించుట మన భాద్యత అని అన్నారు.
ప్రతి శనివారం క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు
ఇకపై సర్కిల్ కార్యాలయాలు, సచివాలయాలలో కూడా అమలు చేస్తాం.
కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
నగరపాలక సంస్థ కార్యాలయాలలో చేపట్టిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమములో సిబ్బంది వారి వారి సిట్ లను శుభ్రం చేసుకోవాలని ఆదేశించుట జరిగిందని అన్నారు. సిబ్బంది వారికీ సంబందించిన ఫైల్స్ పరిశీలించి ఉపయోగకరంగా లేనివి రికార్డు రూమ్ నకు పంపించాలని, అదే విధంగా పాడైన కుర్చీలు, టేబుల్స్ మొదలగునవి తీసివేయాలని ఆదేశించారు. ముందుగా నేడు ప్రధాన కార్యాలయంలో కార్యక్రమము చేపట్టినట్లు, నగరపాలక సంస్థకు సంబందించి అన్ని కార్యాలయాలలో, సర్కిల్ మరియు సచివలయాలలో కూడా ప్రతి శనివారం ఉదయం గంట సమయం శుభ్రత కార్యక్రమము నిర్వహించుట జరుగుతుందని పేర్కొన్నారు. మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో సిబ్బంది విధులు నిర్వహిస్తూ, ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా పనిచేయాలని అన్నారు. కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) శామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, వి.ఏ.ఎస్ & PRO i/c డా.ఎ.రవిచంద్ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News