Breaking News

సచివాలయ పరిధిలో ప్రతి ఇంటినీ సిబ్బంది సందర్శించాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-పసుపుతోటలో సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమం
-పాల్గొన్న సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్
-వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఆరా
-మధురానగర్ రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనుల పరిశీలన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ఉద్యోగులలో జవాబుదారీతనం పెంచేందుకుగానూ ప్రతినెల నాలుగో శుక్ర, శనివారాల్లో సిటిజన్‌ ఔట్‌ రీచ్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. 31 వ డివిజన్ పసుపుతోటలో నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, స్థానిక కార్పొరేటర్ పెనుమత్స శిరీష సత్యంతో కలిసి శనివారం సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వార్డు సచివాలయాల ద్వారా అందుతున్న సేవలపై ఇంటింటికి తిరిగి ఆరా తీశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేయడమే సిటిజన్ ఔట్రీచ్ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. ఇందులో భాగంగా వాలంటీర్లు మరియు సచివాలయం సిబ్బంది కలిసి అర్హత గల ప్రతి పేదవారికి ప్రభుత్వ పథకాలు అందేలా వారిలో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఇంటినీ సందర్శించి పథకాల అమలు తీరుపై వాకబు చేయాలన్నారు. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందించాలని సూచించారు. ఈ సందర్భంగా డివిజన్ లో డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి పాత చిన్న పైపులైన్ల స్థానంలో నూతనంగా పెద్ద పైపులైన్లను ఏర్పాటు చేయవలసిందిగా అధికారులను ఆదేశించారు. గులాబీ తోట వీధిని ఒక మోడల్ గా చేసుకుని చివరి గడప వరకూ యూజీడీ కనెక్షన్ ఇవ్వాలన్నారు. అనంతరం మధురానగర్ రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్.యు.బి) పనులను పరిశీలించారు. కరోనా కారణంగా పనులు కొంత జాప్యం జరిగినట్లు మల్లాది విష్ణు వివరించారు. త్వరలోనే పనులను పూర్తి చేసి నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు.

నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ.. సిటిజర్ ఔట్రీచ్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ తిరిగి గ్రీవెన్స్ స్వీకరించినట్లు తెలిపారు. అలాగే గడపగడపకూ తిరిగి స్వచ్ఛత కార్యక్రమాలపై అవగాహన కల్పించినట్లు వివరించారు. ప్రతిఒక్కరూ చెత్తను బహిరంగ ప్రదేశాలలో పడవేయకుండా.. తడి, పొడి, ప్రమాదకర చెత్తలను వేరుచేసి మున్సిపల్‌ వాహనాల్లో వేయాలని సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో విజయవాడ నగరం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా ప్రజలందరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కార్పొరేటర్ కొంగితల లక్ష్మీపతి, టౌన్ ప్లానింగ్ ఏసీపీ కె.బాలాజీ, ఈఈ శ్రీనివాస్, డీఈ గురునాథం, నాయకులు బెజ్జం రవి, మానం వెంకటేశ్వరరావు, బాలవర్దన్ రావు, శనగశెట్టి హరిబాబు, అంగిరేకుల విజయ్, దేవినేని సుధాకర్, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *