Breaking News

రోడ్ల పై చెత్త పడవేయకుండా ప్రజలకు అవగాహన కలిగివుండాలి…


రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ అధారిటీ వారి ఆదేశాలను అనుసరించి రాజమండ్రి లోని 11వ వార్డు లోని 24, 25 మరియు 26 సచివాలయ సెక్రటరీలు మరియు వాలంటీర్లు అందరూ 25వ సచివాలయం కి చెందిన అడ్మిన్ కెనడి ఆధ్వర్యంలో ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్య స్థానిక రైతు బజార్ నందు శ్రమదాన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కే.రమాదేవి, వెల్ఫేర్ సెక్రటరీ, కే.సూర్యప్రభ, శానిటరీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు. కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దేందుకు నగర ప్రజలు సహకరించాలని, “రాజమండ్రిని” స్వచ్చనగరంగా తీర్చి దిద్దేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎవరు రోడ్లపై చెత్త పడవేయకుండా ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగివుండాలని వారు కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

హంద్రీనీవా జలాలకు సీఎం జల హారతి

-కుప్పం బ్రాంచ్ కెనాల్ వద్ద ప్రత్యేక పూజలు -బీరగానిపల్లె రిజర్వాయర్ శంకుస్థాపన శిలాఫలకం ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు అమరావతి, నేటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *