విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇటీవల తమిళనాడు రాష్ట్రానికి శ్రీలంకకు మధ్య ఉన్న పాక్ జలసంధిని 29 కిలో మీటర్లు ఈది రికార్డు సాధించి నగరంలోని సింగ్‌నగర్‌కు చెందిన కలవకొల్లు జాన్సన్ నాయకత్వంలోని ఆరుగురు టీమ్ సభ్యులను శనివారం కలెక్టర్ యస్ డిల్లీరావు అభినందించారు. ఎప్రిల్ 23వ తేదిన సాధించిన ఈత సాహస కృత్యాన్ని అభినందిస్తూ కొలంబోలోని భారత హై కమీషన్ ఇండియా వారు కలవకొల్లు జాన్సన్ టీమ్‌ను అభినందించడం గర్వకారణం అని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ టీమ్ సభ్యులను స్పూర్తిగా తీసుకుని క్రీడాకారులు భవిష్యత్‌లో మరిన్ని రికార్డులను సాధించి దేశానికి, రాష్ట్రానికి, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
Prajavartha Online Telugu News