అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
“పవిత్ర రంజాన్ మాసం ఈద్-ఉల్-ఫితర్గా ముగిసిన సందర్భంలో ఆంధ్రప్రదేశ్లోని ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రంజాన్ అనేది భక్తి, ఉపవాసం, దానధర్మాలు, స్వీయ నియంత్రణను గుర్తు చేస్తుంది. ఈ మాసంలో ప్రతి ముస్లిం దేవునికి దగ్గరవుతారు. పవిత్ర ఖురాన్ బోధనలు యుగాలుగా సమాజాన్ని తీర్చిదిద్దాయి. ఈ పవిత్ర ఈద్-ఉల్-ఫితర్ రోజున అందరి గౌరవాన్ని, అన్ని రకాల విశ్వాసాలను గౌరవిస్తామని మనం ప్రతిజ్ఞ చేద్దాం. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నందున ముఖ ముసుగు ధరించడంతో పాటు అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.” అని గౌరవ గవర్నర్ బిశ్వ భూషణ్ హరి చందన్ పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు.
Prajavartha Online Telugu News