Breaking News

బాలుర జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్నిఆకస్మిక తనిఖీ…

కొవ్వూరు,  నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు డివిజన్ రెండవ సంవత్సరం సెకండ్ లాంగ్వేజ్ పరీక్షలకు ఇంటర్ విద్యార్ధులు 4390 మంది , ఓకేషనల్ విద్యార్థులు 714 మంది హాజరయ్యారని రెవెన్యూ డివిజన్ అధికారి ఎస్. మల్లిబాబు తెలిపారు. శనివారం స్థానిక టౌన్ బాలుర జూనియర్ కాలేజీ పరీక్షా కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆర్డీవో మల్లిబాబు మాట్లాడుతూ, డివిజన్ పర్డిలోని 17 పరీక్షా కేంద్రాల లో ఇంటర్ రెండవ సంవత్సరం కోసం 4517 మంది, ఒకేషనల్ కోర్సు రెండవ ఏడాది పరీక్షలకు 773 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కొవ్వూరు డివిజన్ పరిధిలో పరిధిలో ఉన్న 17 కేంద్రాలలో రెండవ ఏడాది ఇంటర్ పరీక్షలకి 4,517 మందికి గాను 4,396 మంది హాజరు కాగా 121 మంది హాజరు కాలేదన్నారు. ఒకేషనల్ కోర్సు కి సంబందించిన 773 కి గానీ మందికి గాను 714 మంది హాజరు కాగా 59 మంది హాజరు కాలేదని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో కి సెల్ ఫోన్లు అనుమతించడం లేదని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *