-నగరాభివృధియే లక్ష్యంగా పలు అభివృద్ధి పనులకు శ్రీకారం వై.ఎస్.ఆర్ ప్రభుత్వం
-ఇంధనం, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 40వ డివిజన్ భవానిపురం లారీ స్టాండ్ ఆవరణలో 15వ ఆర్ధిక సంఘ నిదుల నుండి రూ.330 లక్షల అంచనాలతో నూతనంగా నిర్మించనున్న 1500 కె.ఎల్ సామర్ద్యం గల మంచినీటి రిజర్వాయర్ పనులకు మంగళవారం రాష్ట్ర ఇంధనం, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి శంఖుస్థాపన నిర్వహించారు. కార్యక్రమములో పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు మరియు మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మరియు డిప్యూటీ మేయర్లతో కలసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మాట్లాడుతూ సుమారు రూ.330 లక్షల విలువలతో చేపట్టిన ఈ రిజర్వాయర్ పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేసి స్థానిక ప్రజలకు మంచినీటి ఇబ్బందులు తొలగించాలని అన్నారు. నగరాభివృధియే లక్ష్యంగా వెలంపల్లి శ్రీనివాసరావు సారద్యంలో ప్రజల అవసరాలకు అనుగుణంగా అనేక అభివృద్ధి పనులు చేపట్టుట జరుగుతుందని, రాబోవు రోజులలో వై.ఎస్.ఆర్ ప్రభుత్వం అద్వర్యంలో విజయవాడ నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని అన్నారు.
పరిసర ప్రాంత వాసులకు మంచినీటి సరఫరా మెరుగుదల
– నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
కృష్ణనది ప్రక్కన ఉన్నప్పటికీ ఈ ప్రాంతములో ఇంత మేర మంచినీటి ఇబ్బందులు ఉండేవని, నేడు శంకుస్థాపన చేసిన రిజర్వాయర్ నిర్మాణ పనులు పూర్తి అయినచొ 40 మరియు 41వ డివిజన్ ప్రజలకు సంవృద్దిగా రక్షిత త్రాగునీటి సరఫరా చేయుటకు అవకాశం ఉంటుందని అన్నారు. శాసనసభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అద్వర్యంలో నియోజకవర్గ అన్ని విధముల అభివృద్ధి జరుగుతుందని, గతంతో పోల్చితే వై.ఎస్.ఆర్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న అన్ని మౌలిక సదుపాయాలను మెరుగుపరచుట జరిగిందని పేర్కొన్నారు.
త్రాగునీటి వృదా చేయకుండా ప్రజలు సహకరించాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్
రాబోవు వేసవి కాలంలో ఈ ప్రాంత వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా త్రాగునీటి అందించుట జరుగుతుందని, 15వ ఆర్ధిక సంఘ నిధుల నుండి మంచినీటి రిజర్వాయర్ నిర్మాణం చేపట్టినట్లు, పనులు పూర్తి అయినచొ పరిసర ప్రాంత వాసులకు తగినంత నీటి సరఫరా చేయుటకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ప్రజలు మంచినీటిని వృధా చేయకుండా నగరపాలక సంస్థ సహకరించాలని విజప్తి చేసారు.
కార్యక్రమములో డిప్యూటీ మేయర్ అవుతూ శ్రీ శైలజారెడ్డి, ఏ.పి.ఐ.డి.సి. చైర్మన్ బండి పుణ్యశీల, స్థానిక కార్పొరేటర్ యరడ్ల ఆంజనేయరెడ్డిలతో పాటుగా పలువురు కార్పొరేటర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నారాయణమూర్తి, పలువురు అధికారులు, స్థానిక పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News