Breaking News

మైక్రో పాకెట్ ప్రకారం నివాసాల నుండి చెత్తను విభజించి సేకరించాలి

-పారిశుధ్య సిబ్బందికి ఆదేశాలు – నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మంగళవారం హనుమాన్ పేట నందలి వెహికల్ డిపోను సందర్శంచి డిపో ఆవరణ అంతయు పరిశుభ్రంగా ఉంచుతూ చిన్న చిన్న రిపేర్లు చేయవలసిన వాహనములకు తగిన మరమ్మత్తులు నిర్వహించి అందుబాటులోకి తీసుకురావాలని మరియు ఛాపర్ మిషన్ చెట్ల కొమ్మలు తొలగించు యంత్రమునకు తగిన మరమ్మత్తులు నిర్వహించి యుద్దప్రాతిపధికన అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఆవరణలో గడువుతీరి వినియోగంలో లేని వాహనములు ఇతర నిరూపయోగంగా స్క్రాబ్ నంతటిని సత్వరమే ఆక్షన్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. వాహనములను శుభ్ర పరచుటకు వీలుగా ర్యాంప్ నిర్మాణము మరియు ఇతర ఆధునీకరణ పనులు వెనువెంటనే చేపట్టాలని అన్నారు. అనంతరం నవజీవన్ బాలభవన్ కాలువ అంచున ప్రహరి గోడ నిర్మాణం చేపట్టాలని, మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వే స్టేషన్ పరిధిలో గల రైల్వే రోడ్ పూర్తిగా పాడైనందున కొత్త రోడ్డు వేసేలా విధంగా రైల్వే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాలని అన్నారు. తదుపరి కేదారేశ్వరపేట లోని పలు అంతర్గత రోడ్ల యందు పారిశుధ్య నిర్వహణ తీరు మరియు డ్రెయిన్లలో మురుగునీటి పారుదల విధానము పరిశీలించి వీధులు అన్నియు పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని, డ్రెయిన్ నందు మురుగునీటి పారుదలకు అవరోదకరంగా ఉన్న చెత్త మరియు వ్యర్ధములను తొలగించి మురుగునీరు సక్రమముగా ప్రవహించేలా చూడాలని ఆదేశించారు. మైక్రో పాకెట్ ప్రకారం సిబ్బంది ద్వారా ఇంటింటి చెత్త సేకరణ మరియు సి అండ్ జీ వాహనముల పనితీరును స్వయంగా పరిశీలించి నివాసాలలో మూడు బిన్స్ ద్వారా చెత్తను వేరుచేస్తున్నది లేనిది స్థానికులను అడిగితెలుసుకొని పారిశుధ్య సిబ్బంది విధిగా చెత్తను విభజించి సేకరించాలని ఆదేశించారు. పర్యటనలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. కోటేశ్వరరావు, శానిటరీ ఇన్స్ పెక్టర్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

చైర్మన్ కె. బుచ్చి రామ్ ప్రసాద్ పదవీ బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తి

-గొల్లపూడి బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ కార్యాలయంలో అభినందన కార్యక్రమం విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : బ్రాహ్మణ వెల్ఫేర్ కార్పొరేషన్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *