-నిర్దేశించిన లక్ష్యం మేరకు అధికారులు పని చేయాలి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం టిడ్కో గృహలకు ప్రాధాన్యత ఇస్తుందని, ప్రణాళిక ప్రకారం గృహాలను లక్ష్యం మేరకు పూర్తి చేసేందుకు అధికారులు కృషి చేయాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. సచివాలయం లో మంగళవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం లో మంత్రి మాట్లాడుతూ జులై నాటికి 1లక్ష 50 వేల గృహాలను, డిసెంబర్ నాటికి 2.62 లక్షల గృహాలను తప్పనిసరిగా పూర్తి చేసి లబ్దిదారులకు అందజేయాలన్నారు. గుత్తేదారులకు బిల్లుల చెల్లింపులు కోసం ఆర్థిక శాఖ అధికారులతో సమన్వయం సమావేశం ఏర్పాటు చేసి బిల్లులు చెల్లించి గుత్తేదారులకు ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పారు. ప్రాంతాలు, ఏజెన్సీ, పనుల వారీగా దాదాపు నాలుగు గంటలు సమావేశం జరిపి సమీక్షించారు. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం. ఈ ప్రభుత్వ ప్రాధాన్యతలలో ముఖ్య ప్రాధాన్యం టిడ్కో గృహ నిర్మాణం. ఈ టిడ్కో గృహాలను పూర్తి స్థాయిలో పూర్తిచేసి పూర్తి మౌలిక వసతులు కూడా కల్పించి అందజేయాలని దృఢసంకల్పంతో పనిచేస్తున్నాం. ఇళ్ళు కట్టాము అయిపోయింది అనే పద్ధతుల్లో కాకుండా ప్రజలు పూర్తిగా సంతృప్తి చెందే స్థాయిలో అన్ని వసతులతో మాత్రమే ఇళ్లను అందజేయాలి అన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ఈ టిడ్కో గృహనిర్మాణ విషయంలో సంస్కరణలు చేపట్టాం. ప్రజలకు ఇబ్బందిగా మారిన గత ప్రభుత్వ విధానాలను పక్కన పెట్టి ఈ టిడ్కో గృహాలను బడుగు బలహీనవర్గాలకు పేదవారికి అందజేయాలని కృత నిశ్చయంతో పనిచేయాలన్నారు. ఈ ప్రక్రియలో సవాళ్ళను అధికారులు అవకాశాలుగా మలుచుకొని అంకిత భావంతో పనిచేసి సత్వరమే ఈ నిర్మాణాలను పూర్తిచేసి తద్వారా ప్రజలకు మేలుచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకోవాలని మంత్రి సురేష్ కోరారు. ఈ సమావేశం లో టిడ్కో ఎం. డి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News