Breaking News

మహిళల పై జరిగే నేరాలను అరికట్టేందుకు వ్యవస్థలో మార్పు తీసుకురావాలి…

-పరిష్కార మార్గంపై ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ఉమ్మడిగా చర్చించాలి..
-రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల పై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు వ్యవస్థలో మార్పుతీసుకురావలసిన అవసరం ఉందని, మహిళలపై ప్రస్తుతం ఉన్న విష సంస్కృతిని విడనాడి మహిళను గౌరవించే విధంగా ప్రభుత్వ, ప్రైవేట్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేయాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను, దాడులను అరికట్టడంపై చేపట్టవలసిన చర్యలపై చర్చించేందుకు మహిళా కమీషన్ ఆధ్వర్యంలో మంగళవారం కానురు లోని స్త్రీ శిశు సంక్షేమ శాఖ కార్యాలయ సమావేశ మందిరంలో పోలీస్ అధికారులు, నాయ్యవాదులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మహిళా సంఘాల ప్రతినిధులతో మహిళా కమీషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా మహిళలపై ఇటీవల జరుగుతున్న దాడులు, అత్యాచారాలు అందోళన కలిగిస్తున్నాయన్నారు. సమాజంలో మహిళల పై ఉన్న చిన్నచూపు, విషసంస్కృతిని అరికట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడు స్వచ్ఛంద సంస్థలు, మహిళ సంఘాల భాగస్వామ్యం అవసరమని అన్నారు. భవిష్యత్ లో ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్చించేందుకు సమావేశాలు నిర్వహించి నిర్దిష్టమైన సమస్యలను పరిష్కరించేందుకు సూచనలు, సలహాలు తీసుకుంటున్నట్లు ఆమె తెలిపారు. దిశ చట్టం స్పూర్తితో మహిళలపై అత్యాచారాలను కొంతమేరకు అరికట్టగలుగుతున్నామన్నారు. రమ్య కేసులో 8 నెలలో తీర్పు వచ్చిన విధంగా నెల్లూరులో విదేశీ యువతకు సంబంధించిన అత్యాచారాల కేసులో 3 నెలలోనే తీర్పు వచ్చిదన్నారు. అదే విధంగా మిగిలిన కేసులలో కూడా నింధుతులపై విలైనంత త్వరలో తీర్పు వచ్చి కఠిన శిక్షలు పడితే నేరాలు చేసేందుకు బయపడతారన్నారు. నెల్లూరు జిల్లా తాటిపర్తిలో పెళ్లికి ఒప్పుకోలేదనే కావ్వ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను సురేష్ అనే మరో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కాల్చి చంపిన ఘటన ప్రతి ఒక్కరిని కలచివేసిందన్నారు. ఇటువంటి సంఘటనలు సమాజాన్ని ఎటువైపు దారి తీస్తోందో ఉహించని పరిస్థితి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగం స్వచ్ఛంద సంస్థలతో పాటు వ్యవస్థలన్నిటిని వినియోంచుకుని గ్రామ స్థాయిలో మహిళలకు రక్షణ కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించవల్సివుందని వాసిరెడ్డి పద్మ అన్నారు.
సమావేశానికి హాజరైన హెడ్ క్వాటర్ సిఐడి అడిషనల్ ఎస్పీ కె.జి వి సరిత మాట్లాడుతూ మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న దాడులు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఇందుకు యువత నూతన వరవడికి లోనై అనుకున్నది సాధించాలనే పట్టుదలతో చావడానికైన, చంపడానికైన వెనుకాడడం లేదన్నారు. మత్తుపదార్థాలు, మాదక ద్రవ్యాలకు యువత లోను కాకుండా చూడాల్సిన భాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
వాసవ్య మహిళామండలి ప్రతినిధి కీర్తి మాట్లాడుతూ స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలకు, దాడులకు, రాజకీయ రంగులు పులవడం అత్యంత బాధకరం అన్నారు. నేరం చేసిన వారు ఎటువంటి వారైనా కఠినంగా శిక్షింపబడితేనే భవిష్యత్ లో నేరాలు అరికట్టేందుకు అవకాశం వుంటుందన్నారు. పాఠశాలల్లో పేరెంట్ కమిటీలు అలంకార ప్రాయంగానే ఉన్నాయని అలాకాకుండా విద్యా భోదన, నడవడిక వంటి విషయాల్లో చర్చించి పిల్లలు
సక్రమమైన మార్గంలో నడిచేలా పేరెంట్ కమిటీలు కృషి చేయాలన్నారు.
ఏపిఎ్వవో అసోసియేషన్ మహిళా విభాగం అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి మాట్లాడుతూ అత్యాచారం, దాడులు జరిగిన మహిళలకు సరైన సమయంలో సరైన నాయ్యం చేయాలన్నారు. కుటుంబ వ్యవస్థలో పిల్లలు సత్ ప్రవర్తనతో మెలిగేలా తల్లిదండ్రులు కృషి అవసరమన్నారు. మహిళలపై జరిగే నేరాలకు పడే కఠిన శిక్షల గురించి పాఠశాలలు, కళాశాలలో అవగాహన సదస్సులు నిర్వహించి చైతన్యవంతులు చేస్తే కొంత మేరకు ఫలితాలను సాధించవచ్చునని అన్నారు.
ఈ సమావేశంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ జి. ఉమాదేవి, ఆంధ్రా యూనివర్సిటీ ఉమెన్ స్టడీస్ కో ఆర్డినేటర్ డాక్టర్ పి. ఉష, నాగార్జున విశ్వవిద్యాలయం ఉమెన్ స్టడీస్ కో ఆర్డినేటర్ డాక్టర్ శాంతిశ్రీ, ఐద్వాప్రతినిధి రమాదేవి, ప్రముఖ సైకాలజిస్ట్ ఆలె ఫ్రెడ్ జోసఫ్, మహిళా అభ్యదయం ప్రతినిధి అరుణ, అశ్లీల ప్రతిఘటన వేదిక అధ్యక్షులు గోపిచంద్, అమరావతి జేయసి ప్రతినిధి సుశీల, ఏపి మహిళా సమాఖ్య ప్రతినిధి అక్కినేని వనిత, మహిళా కమిషన్ సభ్యురాలు బూసి వినీత తదితరులు ప్రసంగించి మహిళల పట్ల జరుగుతున్న అత్యాచారాలు, దాడుల నివారణకు పలు సూచనలు, సలహాలను అందజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *