మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అసని తుఫాన్ తీవ్ర రూపం దాలుస్తున్న వేళ ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా సముద్ర తీరప్రాంతాల గ్రామాల్లో ఉన్న ప్రజలు సురక్షితంగా ఉండలాని ,అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని మంత్రి జోగి రమేష్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యే అవకాశం ఉన్నందున అక్కడ ప్రజలందరిని సురక్షితమైన ప్రదేశాలక తరలించాలని గౌరవ మంత్రి జోగి రమేష్ అధికారులను ఆదేశించారు. తుఫాన్ ప్రభావంతో గంటకు 75-95 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నందున మత్స్యకారులు ఎవరూ సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని, బీచ్లలోకి సందర్శకులు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా జోగి రమేష్ గారు సూచించారు. అసని తీవ్ర రూపం దాల్చుతున్న వేళ అనుకోని అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల కోసం 9 ఎన్.డీ.ఆర్.ఎఫ్, 9 ఎస్.డీ.ఆర్.ఎఫ్ బలగాలను తుఫాన్ ప్రభావిత జిల్లాలకు ముందుగానే పంపించారని,మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చామని గౌరవ మంత్రి జోగి రమేష్ గారు వివరించారు. జిల్లా కలెక్టర్ మరియు ఉన్నతాధికారులు పర్యవేక్షణలో తుఫాన్ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడం జరిగిందని, అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటారని ఎవరూ ఆందోళన చెందకుండా ఉండలాని జోగి రమేష్ తెలిపారు.
మచిలీపట్నం కలెక్టరేట్: 99086 64635, 08672 25257
మచిలీపట్నం ఆర్డీవో ఆఫీస్: 08672252486
Prajavartha Online Telugu News