విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా నేడు తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ 39,40 సచివాలయ పరిదిలోని CSI స్కూల్,కమిలి బాబా ఆశ్రమము,గుమ్మడి తోట,శివగిరి కొండ మరియు పడమటి వారి స్ట్రీట్ లో కొండ పైన చివరి అంచు వరుకు ఉన్న ఇంటి ఇంటికి కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి తో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల జాబితా పట్టుకొని, ప్రతి గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలు ను సంబంధిత సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమయినంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అవినాష్ మాట్లాడుతూ రాబోయే రోజులలో నూటికి నూరుశాతం ప్రజలకు, అర్హులయినవారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది అని అన్నారు. పూర్తిగా పారదర్శకత, పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే విధముగా పని చేయాలని వాలంటీర్లకు, సచివాలయం సిబ్బందినకి సూచించినట్టు తెలిపారు. ఏది ఎన్నికలు సమయం కాదు అని, ప్రజలందరికి అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయో లేవో తెలుసుకుని,అలాగే డివిజన్ లో ఇంకా చెయ్యాల్సిన అభివృద్ధి పనులను తెలుసుకుని మున్సిపల్ అధికారులు తో మాట్లాడి వీలు అయినంత త్వరగా పూర్తీ చేస్తాం అని హామీ ఇచ్చారు.కులాలు,మాటలు,రాజకీయాలు ఆతీతంగా సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పారు.గడప గడపకు తిరుగుతుంటే ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం చాలా అందనంగా ఉంది అన్నారు.7వ డివిజన్ సంబందించిన మాజీ కార్పొరేటర్ ఇంట్లో ప్రభుత్వ పథకాలు అందాయి అని వారి కుటుంబ సభ్యులు చెప్పడం సంతోషంగా ఉంది అని తెలియజేసారు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో జన్మభూమి కమిటీలు అని అబద్దపు మాటలు చెప్పి వాళ్ళకి సంబదించిన మనుషులకు మాత్రమే పథకాలు ఇచ్చేవారు అని, మా వైసీపీ ప్రభుత్వం ఆలా కాదు అని మాట ఇస్తే కట్టుబడి ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని,ఈ రోజు ఈ డివిజన్ లో తెలుగుదేశం పార్టీ మాజీ కార్పొరేటర్ పథకాలు రావడమే నిదర్శనం అన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు సంపత్,శ్యామ్,సొంగా రాజ్ కమల్, ఉదయ్,క్లైవ్,శంకర్,మహిళా నాయకులు సుభాషిణి,సుజాత,చంద్రిక,సౌమ్య తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News