Breaking News

ఇప్పటికైన ముఖ్యమంత్రి తనకు న్యాయం చేయాలి… : షేక్ జలీల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇప్పటికైన ముఖ్యమంత్రి తనకు న్యాయం చేయాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు షేక్ జలీల్ కోరుతున్నారు. శుక్రవారం విజ‌య‌వాడ‌లోని గాంధీనగర్ ప్రెస్‌క్లబ్‌లో ఆయ‌న విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, ఆత్మకూరులో సర్వే నంబర్ 117/1 ఎలో 85 సెంట్ల స్థలం అన్ని ఆధారాలతో ఉన్నా కూడా తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. పట్టా భూములు నిషేధిత జాబితలో ఎటువంటి గెజిట్ లేకుండా చట్ట విరుధమైన పనులను మంగళగిరి సబ్ రిజిష్టరు, జిల్లా సబ్ రిజిష్టరు, పంచాయితీ గ్రామ కార్యదర్శి ఏకమై ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 117/1ఎ సర్వే నెంబరును ఎమ్మార్వో, ఆర్డీవో, సబ్ కలెక్టర్‌లు సబ్ డివిజన్ చేసి 117 /1 ఎ 1గా 0.50 సెంట్లు, ఎ 2గా 35 సెంట్లు చేశార‌ని ఆరోపించారు. ఈ విషయమై సంబంధిత అధికారులకు విన్నవించినా భూ సర్వే పేరుతో అధికారులు కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. ఆయా అధికారుల వల్ల ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ప్రభుత్వం చోద్యం చూస్తుంద‌ని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కక్ష్య సాధింపు చ‌ర్య‌లు మానుకొని 117 / ఎ సర్వే నెంబరును 22 ఎ జాబితాల నుంచి తొలగించాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు. సంబంధిత అధికారులకు 22 ఎ నిషేధిత జాబితా నుంచి 117 / 1 ఎ తొలగించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండు చేశారు. భూసర్వే వలన రెవిన్యూ అధికారులు, మండల సర్వేయర్లు, జిల్లా సర్వేయర్లు, జిల్లా కలెక్టరు, మండల కమిటీ, నియోజక వర్గ కమిటీ, డిస్టిక్ కమిటీ భూసర్వే అన్ని రైతులను భయభ్రాంతులను చేస్తూ లంచాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారని, లేకపోతే భూమి వాల్యూషన్ బట్టి 5 శాతం నాలా ఫీజు కట్టాలని ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. ముస్లిం ఐక్యవేదిక అంజుమన్ ఇస్లామిక్ కమిటీ ద్వారా రాష్ట్రంలో తాము అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, ఇప్పటికైన సీఎం జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *