Breaking News

అసని తుఫాన్ కు నష్టపోయిన అరటి రైతులను ఆదుకుంటాం అధైర్యపడవద్దు… : మంత్రి జోగీ రమేష్

తోట్లవల్లూరు, నేటి పత్రిక ప్రజావార్త :
అసని తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన అరటి సాగు రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, ఎవరు అధైర్య పడవద్దని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ రైతులకు అభయమిచ్చారు. పామర్రు నియోజకవర్గం తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం, రొయ్యూరు, భద్రిరాజుపాలెం గ్రామాల పరిధిలో మంత్రి ఎమ్మెల్యేతో కలసి శనివారం పర్యటించి రైతులను పరామర్శించి, అరటి పంట నష్టం పరిశీలించారు. రొయ్యూరు గ్రామ పరిధిలో రైతు కాసరనేని రాంప్రసాద్ కు చెందిన దెబ్బతిన్న అరటి పంట పొలం పరిశీలించారు. అనంతరం భద్రిరాజుపాలెం గ్రామ పరిధిలో రైతులు బసివి రెడ్డి, నాగిరెడ్డిలకు చెందిన నష్టపోయిన అరటి పంట పరిశీలించారు. ఎకరాకు పెట్టుబడి ఎంత పెట్టారు? ఎన్ని ఎకరాలు అరటి సాగు చేశారు? ఇత్యాది వివరాలు మంత్రి అడిగి తెలుసుకున్నారు. ఎకరాకు 50 వేల వరకు పెట్టుబడి పెట్టామని తుఫాన్ ప్రభావానికి అరటి చెట్లు నేలకొరిగి నష్టపోయామని ఆదుకోవాలని రైతులు కోరారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి జె. జ్యోతి ఈ ప్రాంతంలో ఉద్యాన పంటలకు జరిగిన నష్టం నివేదిక మంత్రికి సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అశని తుఫాను ప్రభావానికి తోట్లవల్లూరు మండలంలో 1491 ఎకరాల్లో అరటి పంట దెబ్బతిందని ఎమ్మెల్యే ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకువెళ్లారని, వెంటనే అధికారులను అప్రమత్తం చేసి వెనువెంటనే ఎన్యూమరేషన్ చేపట్టారని అన్నారు. అందులో 254 ఎకరాల్లో 215 మంది రైతుల అరటి పంట దెబ్బతిన్నట్లు గమనించినట్లు, రైతులు ఎవరు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఏ విపత్తు జరిగినా వెంటనే స్పందించే ముఖ్యమంత్రి జగన్ త్వరలోనే పంటనష్ట పరిహారం అందించే కార్యక్రమం చేపడరన్నారు. ఎమ్మెల్యే గారి కృషితో ఈ ప్రాంతంలోని లంక భూముల్లో సాగు చేసుకునే ఎస్సీ ఎస్టీ బిసి ఓబీసీలో పేద రైతులకు 4 వేల మందికి గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వం రైతు భరోసా, ఇన్పుట్ సబ్సిడీ,పంటల భీమా అందిస్తున్న విషయం మంత్రి గుర్తు చేశారు. విపత్తు జరిగిన వెంటనే సాయం అందించే ప్రభుత్వమని, రైతును రాజుగా నిలబెట్టే ప్రభుత్వమని, రైతు బాగుంటేనే మనం బాగుంటామని అన్నారు అంతేకాకుండా రైతులకు సున్నా వడ్డీ రుణాలు, పంట రుణాలు అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ప్రతి గ్రామంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి, మట్టి నమూనా పరీక్షలు, రైతులకు అవసరమైన సబ్సిడీ విత్తనాలు, ఎరువులు పంపిణీ, పంట పెట్టుబడి కోసం రైతు భరోసా, రైతులను విజ్ఞానవంతం చేయుటకు, వారికి తగిన సూచనలు సలహాలు అందిస్తూ ఎన్నో సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఒక్క రైతు కూడా నష్టపోకుండా పంట నష్టం అంచనాలు వేసి అతిత్వరలో పంట నష్టం ఇప్పించే బాధ్యత మంత్రిగా నేను, శాసనసభ్యులు తీసుకుంటామన్నారు.

పామర్రు శాసనసభ్యులు కైలే అనిల్ మాట్లాడుతూ అసని తుఫాన్ ప్రభావంతో రైతులు పడిన ఇబ్బందులు గమనించి, మంత్రి వెంటనే అధికారులకు తగు ఆదేశాలు ఇచ్చి ఎన్యూమరేన్ అధికారులు చేపట్టారన్నారు. రైతు ప్రభుత్వం అని, ముఖ్యమంత్రి రైతు పక్షపాతి అని పేర్కొన్నారు. ప్రతి గ్రామంలో ఆర్ బి కే లు, నియోజకవర్గస్థాయిలో అగ్రి టెస్టింగ్ ల్యాబ్ లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం గుర్తు చేశారు. ఈ ప్రాంతంలో పంటల బీమా క్రింద పసుపు రైతు ఎకరాకు లక్ష రూపాయల వరకు లబ్ధి పొందినట్లు తెలిపారు.

తొలుత స్థానిక ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలసి మంత్రి తోట్లవల్లూరు మండలం వల్లూరు పాలెం గ్రామానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు, అధికారులు పార్టీకార్యకర్తలు గౌరవ మంత్రి గారికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక జెడ్ పి టి సి జొన్నల రామ మోహన్ రెడ్డి, ఎంపీపీ రాజమణి, ఆర్డిఓ విజయ్ కుమార్, తాసిల్దారు కట్టా శివయ్య, ఎంపీడీవో స్వర్ణలత, ఎంపీటీసీ కాసరనేని అనురాధ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *