విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బ్రెజిల్ లో నిర్వహించిన 2021 డెఫ్ ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన షేక్ జఫ్రీన్ ను శాప్ ఎండీ ఎన్ . ప్రభాకర రెడ్డి అభినందించారు . టెన్నిస్ డబుల్స్ విభాగంలో కాంస్య పతకం సాధించి ఆంధ్ర ప్రదేశ్ ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేశారన్నారు . జఫ్రీన్ సాధించిన విజయం చూసి ఏపీ గర్వపడుతోందన్నారు. చిన్నప్పటి నుంచి అనేక సవాళ్లను దాటుకుని ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో జఫ్రీన్ డెఫ్ లింపిక్స్ లో పతకం సాధించడం నేటి యువతకు స్ఫూర్తి దాయకం అని శాప్ ఎండీ ఎన్ ప్రభాకర రెడ్డి కొనియాడారు. జఫ్రీన్ కు అత్యున్నత శిక్షణ అందించేందుకు , బ్రెజిల్ ఒలింపిక్స్ లో పాల్గొనేందుకు ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్ ) రూ . 7 లక్షల ఆర్ధిక సాయాన్ని అందించి ప్రోత్సహించిందని చెప్పారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News