
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో బీసీలకు సీఎం వైఎస్ జగన్ ఇస్తున్న ప్రోత్సాహం, ప్రాధాన్యం నిరుపమానమని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు బోను దుర్గా నరేష్ కొనియాడారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్యకు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రo నుండి రాజ్యసభకు పంపుతున్న సందర్భంగా గురువారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ వద్ద బీసీ సంక్షేమ సంఘం నాయకులు బోను దుర్గా నరేష్ ఆధ్వర్యంలో సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోను నరేష్ మాట్లాడుతూ బీసీలను బ్యాక్ బోన్ గా భావించి పదవుల కేటాయింపులో పెద్దపీట వేస్తూ ఆర్.కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇచ్చినందుకు సీఎం జగన్ కి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. 45 సంవత్సరాలు పాటు బీసీల కోసం దాదాపు 12 వేలకు పైగా ఉద్యమాలు , పోరాటాలు సేసి బీసీల అభ్యున్నతి కోసం 2 వేలకు పైగా జివోలు తీసుకురావటానికి కష్టపడిన కృష్ణయ్య కు రాజ్యసభ సీటు ఇవ్వటం హర్షించదగ్గ విషయం అన్నారు. గతంలో బీసీ లను అందరూ ఓటు బ్యాంకు గానే వాడుకున్నారు కానీ సీఎం జగన్ మాత్రమే బీసీ లకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. 2024 ఎన్నికల్లో బీసీ సంక్షేమ సంఘం తరపున వైసీపీ కి బీసీలు అండగా నిలిచి జగన్ మరలా ముఖ్యమంత్రిగా చేయటమే లక్ష్యంగా కష్టపడి పని చేస్తాం అన్నారు. బీసీ లకు అండగా నిలుస్తున్న సీఎం జగన్ ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం అని ఆయన అన్నారు. కృష్ణయ్య గురించి విమర్శలు చేసే ప్రతి ఒక్కరూ వారి గత చరిత్ర తెలుసుకోవాలి అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో బీసీల కోసం ఆయన పడిన కష్టం వర్ణించలేనిది అని చెప్పారు . కృష్ణయ్య పై మరోసారి ఎవరైనా విమర్శలు చేస్తే బీసీలుగా తమ ప్రతాపం చూపిస్తాం అని హెచ్చరించారు . గత ప్రభుత్వ హయాంలో రాజ్యసభ సీట్లు ఎవరెవరికి ఇచ్చారో తెలుసుకొని మాట్లాడాలి అని ఆయన హితవు పలికారు. కృష్ణయ్య కష్టాన్ని గుర్తించి జగన్ ఆయనకు ఈ పదవి ఇచ్చారు అని బీసీలు అందరూ ఒకే తాటి పై ఉండాలని కోరుకుంటున్నాం అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ నివసించేది పక్క రాష్ట్రాల్లో సొంత ఇల్లు ఉన్నది అక్కడేఆ అన్న విషయం గుర్తు ఉంచుకొని మాట్లాడాలి అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సిటి యువజన విభాగం అధ్యక్షులు పెంట సాయి కిరణ్, సిటీ అధ్యక్షులు కె.లక్ష్మణరావు, దాడి అప్పారావు, పట్నాల హరిబాబు, విక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News