Breaking News

వివిధ శాఖల సమన్వయంతో అభివృద్ధి పనులు వేగవంతము చేయాలి

-ఇరిగేషన్, ఆర్ అండ్ బి, రెవిన్యూ మరియు నగరపాలక సంస్థ అధికారులతో పలు అంశాలపై సమీక్ష
-కమిషనర్ శ్రీ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, శుక్రవారం తన ఛాంబర్ నందు నగరంలో వివిధ శాఖల సమన్వయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనుల యొక్క పురోగతి మరియు ఇంకను చేపట్టవలసిన చర్యలపై సమీక్షించి పలు ఆదేశాలు ఇచ్చారు. కృష్ణలంక రిటర్నింగ్ వాల్ నిర్మాణమునకు సంబందించి నిర్మాణ పనులకు ఆటంకంగా ఉన్న ఆక్రమణల విషయమై అధికారులను వివరాలు అడిగితెలుసుకొని పనులకు అవరోధంగా ఉన్న సమస్యలను పరిష్కరించి రిటర్నింగ్ వాల్ నిర్మాణ పనులు వేగవంతము చేయుటకు చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా పద్మావతి ఘాట్ నందు గల ఆక్రమణలకు సంబందించి అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాల వారికీ జె.ఎన్.ఎన్.ఎన్.యు.ఆర్.యం పధకం క్రింద నిర్మించిన జీ + 3 గృహాలలో ఇళ్ళు కేటాయించుటకు అవసరమైన లబ్దిదారుల వాటాను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్టుమెంటు వారు చెల్లించిన దర్మిలా వారికీ ఇళ్ళు కేటాయించుటకు సత్వరమే చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వీటితో పాటుగా ఇరిగేషన్ శాఖా వారిచే నగరంలో 7 ప్రదేశాలలో బ్రిడ్జి నిర్మాణ పనులకు ఆటంకంగా గల ఆక్రమణల విషయమై అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. అదే విధంగా గుణదల ఆర్.ఓ.బి మరియు మధురానగర్ నందు నగరపాలక సంస్థ అద్వర్యంలో జరుగుతున్న ఆర్.యు.బి నిర్మాణ పనుల వివరాలపై చర్చిస్తూ, వివిధ శాఖల అధికారులు సమన్వయంతో సత్వరమే పూర్తి చేయుటకు ప్రణాళికలను రూపొందించుకొని పనులు వేగవంతము చేయుటకు చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఇరిగేషన్ వారిచే 28 కిలో మీటర్ల పొడవున బుడమేరు శుద్ధి చేయు పనుల వివరాలు అడిగితెలుసుకొని పలు సూచనలు చేస్తూ, బుడమేరు ముంపు నివారణకు సంబందించి డ్రెయిన్ నిర్మాణము చేపట్టుటకు అవసరమగు అంచనాలు రూపొందించి తదుపరి సమావేశమునకు సమర్పించాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. సమావేశంలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర్, ఎస్. ఇ ఆర్ అంది బి, ఎస్.ఇ ఇరిగేషన్, సిటి ప్లానర్ జీ.వి.జీ.ఎస్.వి ప్రసాద్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ శకుంతల, డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్, ఎగ్గిక్యుటివ్ ఇంజనీర్లు, తహసిల్దార్ లు, ఆర్ అండ్ బి, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *