-తెలుగు వారి తెగువకు నిలువెత్తు నిదర్శనం ‘ఆంధ్రకేసరి’: ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, ఆంధ్రుల ఆత్మగౌరవానికి ప్రతీకగా టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం ఎంతో ఆదర్శనీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. ఆ మహనీయుని 65వ వర్థంతిని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఆయన విగ్రహానికి పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్, తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మిలతో కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. ప్రకాశం పంతులు అతి సామాన్య కుటుంబం నుంచి అంచెలంచెలుగా ఉన్నత స్థాయికి చేరుకున్నారన్నారు. జాతిపిత మహాత్మాగాంధీ పిలుపుతో తన న్యాయవాది వృత్తిని విడిచి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారన్నారు. ఆంధ్ర ప్రజల ఆకుంటిత ధైర్యసాహసాలకు, ఆంధ్రుల అసమాన త్యాగనిరతికి మారుపేరుగా నిలిచారన్నారు. తెల్లవాడి తూటాకు గుండెను చూపిన ధీశాలి అని కొనియాడారు. స్వాతంత్ర్యం సాధించటంలో, పాలనదక్షతలో ఎంతో ఆదర్శవంతంగా నిలిచారన్నారు. ఆ మహనీయుని ఆదర్శాలే స్ఫూర్తిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని, ఆయన బాటలోనే పయనిస్తోందన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు ధైర్యాన్ని, పోరాట స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని నేటి యువత రాణించాలని ఆకాంక్షించారు.
మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రజల ఆకుంటిత ధైర్యసాహసాలకు, అసమాన త్యాగనిరతికి ఆంధ్రకేసరి మారుపేరని కొనియాడారు. మద్రాసు ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా, ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయిన తరువాత తొలి ముఖ్యమంత్రిగా రాష్ట్ర అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జి దేవినేని అవినాష్ మాట్లాడుతూ.. టంగుటూరి ప్రకాశం పంతులు త్యాగం, సాహసం భావితరాలకు ఆదర్శమని పేర్కొన్నారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు శర్వాణీ మూర్తి, జానారెడ్డి, నాయకులు దోనేపూడి శ్రీనివాస్, దమ్మాలపాటి చంద్రశేఖర్, కె.బలరాం, ఉమా బలరాం, గుండె సుందర్ పాల్, శనగవరపు శ్రీనివాస్, చామర్తి మూర్తి, నాళం సురేష్, పింగళి రాయల్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News