Breaking News

రాష్ట్రంలో ప్రతి ఒక్కరి సంక్షేమమే వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ధ్యేయం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనరంజకంగా పరిపాలన అందిస్తున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి కి మద్దతు గా నేడు రాష్ట్రంలో ప్రజలు ముందుకు వస్తున్నారని, వైస్సార్సీపీ నాయకులు ప్రజలలోకి వెళుతుంటే బ్రహ్మరథం పడుతున్నారని, ప్రభుత్వం మీద వారి సంతృప్తి కి ఇదే నిదర్శనం అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. శనివారం స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి తో కలిసి దేవినేని అవినాష్ గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 7వ డివిజన్ మొగల్రాజపురం నైస్ బార్ పక్క రోడ్ నుండి మొదలై వెంకటేశ్వర రావు స్ట్రీట్,జాన్ స్ట్రీట్ మరియు జక్కరయ్య స్ట్రీట్ పరిసర ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన అవినాష్ లబ్దిదారులకు ఉత్తరం రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ పథకాలు అమలు తీరును వివరించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సంక్షేమం -అభివృద్ధి కోసం పలు పథకాలను ప్రవేశపెట్టి సమర్థవంతంగా అమలు చేస్తున్నారని అలాగే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మహిళల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టారని గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి సంక్షేమ పథకాల విషయంలో ప్రజలే అర్థం చేసుకుంటారు అని అన్నారు. కరోన కష్టకాలంలో కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదని, గత తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో పచ్చ చొక్కా వాళ్లకు మాత్రమే ప్రభుత్వ పథకాలను అందజేసే వాళ్లని, కానీ మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో కులాలకు, మతాలకు,ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నారని తెలియజేసారు, రాబోయే రోజుల్లో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి మీ అందరి సహాయ సహకారాలు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు వేగి వెంకటేశ్వర రావు, సొంగా రాజ్ కమల్, వడ్లమూడి సంపత్, తోకల శ్యామ్, కొండా, అశోక్, కుటుంబరావు ఉదయ్, ఆనంద్,కత్తుల సంపత్ మహిళా నాయకులు సుభాషిణి,సుజాత, చంద్రిక, కనకమహాలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *