Breaking News

అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్యలకు పరిష్కారం చూపాలి

-స్పందనలో ప్రజల నుండి 14 అర్జీలను స్వీకరించిన
-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌ర పాల‌క సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నందు సోమవారం స్పందన నిర్వహించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, ప్రజల నుండి సమస్యల అర్జీలను స్వీకరించి నగరపాలక సంస్థ కల్పిస్తున్న మౌలిక సదుపాయాలలో ఎదురౌతున్న ఇబ్బందులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి అర్జీదారుల సంతృప్తే లక్ష్యంగా సమస్యలను నిర్దేశించిన గడువులోగా పరిష్కరించాలని అన్నారు. సమస్యలను పరిష్కరించుట, వాటికీ సంబందించిన ఫోటోలను స్పందన యాప్ నందు పొందుపరచుట, అర్జీదారులకు మరియు ఉన్నతాధికారులకు ఎస్.యం.ఎస్ ద్వారా సమాచారం తెలియజేయుట వంటి అంశాలపై దృష్టి సారించాలని సూచించారు. నేటి స్పందన కార్యక్రమములో అదనపు కమిషనర్ (జనరల్) – 1, ఇంజనీరింగ్ విభాగం – 2, పట్టణ ప్రణాళిక విభాగం – 9, పబ్లిక్ హెల్త్ విభాగం –1, రెవెన్యూ – 1, మొత్తం 14 అర్జీలు సమర్పించుట జరిగింది. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (జనరల్) శ్రీమతి యం.శ్యామల, అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన
సర్కిల్-1 కార్యాలయములో జోనల్ కమిషనర్ కె.టి సుధాకర్ అధికారులతో కలసి నిర్వహించిన స్పందనలో నిర్వహించగా ఇంజనీరింగ్ విభాగం-2, పట్టణ ప్రణాళిక విభాగం -1 అర్జీలు వచ్చినవి, సర్కిల్-2 మరియు సర్కిల్–3 కార్యాలయాలలో ఎటువంటి అర్జీలు వచ్చియుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *