విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “గడప గడపకు మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా నేడు తూర్పు నియోజకవర్గంలోని 7వ డివిజన్ 37వ సచివాలయ పరిదిలోని బోయపాటి మాధవరావు స్ట్రీట్ (గుహలు దగ్గర),పటమట వారి స్ట్రీట్ మరియు శివాలయం స్ట్రీట్ వరకు ఉన్న ఇంటి ఇంటికి కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి తో కలిసి తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జ్ దేవినేని అవినాష్ ప్రభుత్వ పధకాల లబ్ధిదారుల జాబితా పట్టుకొని, ప్రతి గడప గడపకు తిరుగుతూ స్థానిక ప్రజల సమస్యలు ను సంబంధిత సచివాలయం సిబ్బంది మరియు మున్సిపల్ అధికారులు ద్వారా వివరాలు తెలుసుకుని సాధ్యమయినంత త్వరలో పరిష్కరించి వారికి అందేలా చర్యలు చేపట్టాలని కోరారు. అవినాష్ మాట్లాడుతూ రాబోయే రోజులలో నూటికి నూరుశాతం ప్రజలకు, అర్హులయినవారికి సంక్షేమ పథకాలు అందేలా ప్రణాళికను రూపొందించడం జరుగుతుంది అని అన్నారు. పూర్తిగా పారదర్శకత, పాటిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించే విధముగా పని చేయాలని వాలంటీర్లకు, సచివాలయం సిబ్బందినకి సూచించినట్టు తెలిపారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ కులాలు, మతాలు,రాజకీయాలు ఆతీతంగా సంక్షేమం అందిస్తున్నాం అని చెప్పారు.గడప గడపకు తిరుగుతుంటే ప్రజలు సంతోషం వ్యక్తం చేయడం చాలా అందనంగా ఉంది అన్నారు.గత తెలుగుదేశం ప్రభుత్వంలో హయాంలో జన్మభూమి కమిటీలు అని అబద్దపు మాటలు చెప్పి వాళ్ళకి సంబదించిన మనుషులకు మాత్రమే పథకాలు ఇచ్చేవారు అని, మా వైసీపీ ప్రభుత్వం ఆలా కాదు అని మాట ఇస్తే కట్టుబడి ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని,జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు,ఇండ్ల స్థలాలు ప్రజల గడప వద్దకు వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ గారిదే అని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ నాయకులు వేగి వెంకటేశ్వర రావు, కుటుంబరావు, సొంగా రాజ్ కమల్, వడ్లమూడి సంపత్, తోకల శ్యామ్, కొండా, అశోక్, ఆనంద్, మహిళా నాయకులు సుజాత, చంద్రిక, సోమ్య తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News