-విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైసీపీ ప్రభుత్వంలో బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీలకు అత్యధికంగా కేబినెట్‌తోపాటు వివిధ కార్పొరేషన్లు, సంస్థల్లో ప్రాతినిధ్యం కల్పించిన సిఎం జగన్మోహన్రెడ్డితోనే సామాజిక న్యాయం సాధ్యమని దేవినేని అవినాష్ తెలిపారు. ఈ నెల 26న ఉత్తరాంధ్ర నుంచి ప్రారంభం కానున్న సామాజిక న్యాయ భేరి బస్సుయాత్ర పోస్టర్‌ను సోమవారం గుణదల వైస్సార్సీపీ కార్యాలయంలో ప్రజా ప్రతినిధులతో కలిసి ఆవిష్కరించడం జరిగింది.అనంతరం మీడియాతో అవినాష్ మాట్లాడుతూ గత ప్రభుత్వాలు బిసి అంటే బ్యాక్వర్డ్ గానే చూశాయని, కానీ సిఎం జగన్.. బిసి అంటే రాష్ట్రానికి బ్యాక్‌బోన్ అని ప్రాధాన్యనిచ్చి, పైకి తీసుకొస్తున్నారని తెలిపారు. అటువంటి ముఖ్యమంత్రికి అండగా ఉండి సామాజిక న్యాయ భేరి సభను ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ కార్పొరేటర్లు అంబేద్కర్, మాధురి, రెహానా నాహిద్, వైస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News