-స్పందనలో 102 ఆర్జీలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనపై ప్రజలు పెట్టుకున్న నమ్మకానికి అనుగుణంగా సమస్యలను తక్షణమే పరిష్కరించి వారి ఆకాంక్షలు నేరవేర్చాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను కోరారు. స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు నిర్వహించి ప్రజల నుండి ఆర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అధికారులకు సూచిస్తూ స్పందన కార్యక్రమం ద్వారా తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ప్రజలు ఎంతో నమ్మకంతో ఆర్జీల ద్వారా స్పందనలో వారి సమస్యలను విన్నవించుకుంటున్నారన్నారు. ప్రజలు సమర్పించిన ఆర్జీలపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కార దిశగా కృషి చేయాలన్నారు. ప్రతీ ఆర్జీ దారుడు సంతృప్తి చెందేలాగా ఆర్జీలకు సంబంధించి పరిష్కార చర్యలు చేపట్టి త్వరితగతిన సమస్యలను పరిష్కరించాలన్నారు. గృహా నిర్మాణ, పెన్షన్లు, భూ సమస్యలపై పరిష్కారం, రేషన్ కార్డులు తదితర సమస్యలపై వచ్చే ఆర్జీలను సంబంధిత అధికారలు తమ పరిధిలో పరిష్కారం కానివాటిని పై అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు ప్రతీ ఒక్కరూ స్పందన పోర్ట్‌ల్‌ను ఒపెన్ చేసి నమోదు అవుతున్న ఆర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు. బియాండ్ ఎస్‌ఎల్‌ఏలోకి ఏ ఒక్క దరఖాస్తు వెళ్లకుడాదన్నారు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో అధికారులు సమస్యలను పరిశీలించి నిర్ణిత కాల పరిమితిలోగా పరిష్కరించాలన్నారు. సాంకేతికంగా ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకుని కాలయాపన లేకుండా పరిష్కారం చూపాలన్నారు. స్పందన వినతుల పరిష్కారంలో నిర్లక్ష్యం కూడదని కలెక్టర్ అధికారులను కోరారు.
స్పందనలో వచ్చిన ఆర్జీలు…
ఎ కొండూరు మండలం కోమటిగుంట గ్రామానికి చెందిన సిహెచ్ లక్ష్మిప్రసన్న పుట్టుకతో మానసిక శారీరక అంగవైకల్యం కలిగి ఉండడంతో ఆమెకు వైద్య ఖర్చులు బారమై ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నమని తమ కుమారైకు ప్రభుత్వం ఇచ్చే 3000 రూపాయలను 10 వేల రూపాయలకు పెంచి ఆదుకునేలా సహకారించాలని కలెక్టర్ వారిని కోరుతూ లక్ష్మిప్రసన్న తల్లిదండ్రులు ఆర్జీని సమర్పించాలరు.
రాష్ట్ర మేదర సంఘం తరుపున రాష్ట్ర సంఘ అధ్యక్షులు కె. నరసింహరావు జిల్లా కలెక్టర్‌కు ఆర్జీని అందజేస్తూ మేదరలకు ప్రభుత్వం వెదురు పై హక్కు కల్పించి కావాల్సిన వెదురును మేదరులకు సరఫరా చేయాలని మేదర కార్మికులకు నైపుణ్యంనకు శిక్షణ కార్యక్రమాలు, పరిశ్రమలు ఏర్పాటు చేసే ప్రభుత్వ సహకారం కోరుతూ విజ్ఞప్తి చేశారు.
మైలవరం మండలం చండ్రగూడెం గ్రామానికి చెందిన ఎస్ భాస్కర్‌రావు అనే రైతు తన పొలానికి ఆర్‌అండ్‌బి రోడ్డునకు మధ్యలో ఆక్రమణలు జరిపి ఇల్లు కట్టడం చేస్తున్నారని ఈ చర్యను నిలుపుదల చేయవలసిందిగా స్పందన కార్యక్రమంలో ఆర్జీ సమర్పించారు.
వత్సవాయి మండలం పాతవేమవరం గ్రామనికి చెందిన పి సురేష్, డి శ్రీను యాదల సరళ, యాదల సీతమహలక్ష్మి, తదితరులు తమ గ్రామంలో సర్వే పూర్తి చేసినప్పటికి నూతన గృహాల నిర్మాణాలకు అనుమతులు గృహాలపై రుణాలు మంజూరు కావడం లేదని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించాలని స్పందనలో ఆర్జీలను సమర్పించారు.
వీటితో పాటు జిల్లాలో వివిధ ప్రాంతల నుంచి వచ్చిన ఆర్జీదారులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కల్టెర్‌కు స్పందనలో ఆర్జీలు సమర్పించారు.
స్పందన కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నుపూర్ అజయ్ కుమార్, డిఆర్‌వో కె.మోహన్‌కుమార్, వివిధ శాఖల జిల్లా అధికారులు ఉన్నారు.
Prajavartha Online Telugu News