-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందన కార్యక్రమానికి హాజరైన జిల్లా అధికారులకు నూతన జిల్లాలకు కేటాయించిన ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులపై సోమవారం జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు, జిల్లా ఖజానా అధికారితో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాల పున:వ్యవస్తీకరణలో భాగంగా నూతనంగా ఏర్పడిన ఎన్‌టిఆర్ జిల్లాకు పాత కృష్ణాజిల్లా నుండి కొంత మంది ఉద్యోగులను, వీరితోపాటు కార్యాలయ అధిపతులు, డిడివోలను కూడా నూతనంగా కేటాయించడం జరిగిందన్నారు. మే నెల 2022 నుంచి నూతన జిల్లాలో కేటాయించిన ఉద్యోగులకు జీత భత్యాలు చెల్లించవలసి ఉన్నందున ఖజానా అధికారుల సూచన మేరకు తగు చర్యలు తీసుకుని జీత భత్యాల బిల్లులను రూపొందించాలని జిల్లా కలెక్టర్ తెలిపారు.
సమావేశంలో జిల్లా ఖజానా అధికారి ఏ.రవి మాట్లాడుతూ ప్రభుత్వ ఆర్థిక శాఖ ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఖజానా సంచాలకులవారి ఆదేశాలతో ఎన్‌టిఆర్ జిల్లాలోని కొత్తగా ఏర్పడిన జిల్లా కార్యాలయాలకు సంబంధించి 2022 మే నెల జీత భత్యాలను నూతనంగా ఏర్పడిన కార్యాలయం నుండే డ్రా చేయడంలో విధివిధాలను వివరించారు. పాత కార్యాలయం నుండి కొత్తగా ఏర్పడిన కార్యాలయానికి కేటాయించబడిన సిబ్బందిని ూaవ Rశీశ్రీశ్రీ ష్ట్రవతీప.Aూ జఖీూూ పోర్టల్ నందు పాత కార్యాలయం యొక్క డిడివో లాగిన్ నందు ట్రాన్సఫర్ అయిన ఉద్యోగులను హెర్బ్ పోర్టల్ నందు ‘‘ట్రాన్పఫర్ ఔట్’’ చేయుటకు మరియు వారి పొజిషన్ ఐడి తొలగించాలన్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన జిల్లా ఆఫీసు కార్యాలయాలకు మంజూరు చేసిన క్యాడర్ స్ట్రెంత్‌కు సంబంధించి ఖజానా కార్యాలయం నందు జత చేయాలన్నారు. తదుపరి వారికి కేటాయించిన ఉద్యోగులను ఆయా కార్యాలయాల డిడివోలు లాగిన్ నందు ‘‘ట్రాన్పఫర్ ఇన్’’ చేసుకోనుటకు తదితర అంశాలపై జిల్లా ఖజానా అధికారి రవి వివరించారు.
Prajavartha Online Telugu News