Breaking News

జగనన్న ఇళ్ళ లే అవుట్ల పరిశీలన అధికారులకు పలు ఆదేశాలు…

-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జగనన్న లే అవుట్లలో మౌలిక వసతుల పనులు వేగవంతము చేసి లబ్దిదారులు గృహ నిర్మాణాలు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, అధికారులను ఆదేశించారు. నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌ అధికారులతో కలసి వెలగలేరు, కొండపాలూరు, నున్న ప్రాంతాలలో జరుగుతున్న పనులను మంగళవారం పరిశీలించారు. పట్టణ ప్రాంతములలోని నిరుపేదలకు సొంతింటి కలను నేరవేర్చేoదుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకoగా జననన్న గృహ నిర్మాణ పథకం క్రింద అర్హులైన పేద ప్రజలకు ఇళ్ళ స్థలాలు మంజూరు చేయటం జరిగిందని అన్నారు. లే అవుట్లో లబ్దిదారులు గృహా నిర్మాణం చేపట్టేందుకు అవసరమగు కనీస సౌకర్యాలైన విద్యుత్, త్రాగునీరు, రోడ్లు, డ్రెయిన్లు వంటి మౌలిక సదుపాయాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. అదే విధంగా లబ్దిదారుతో సమావేశం నిర్వహించి వీలైనంత మంది గృహ నిర్మాణాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పర్యటనలో సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, సిటి ప్లానర్ జీ.వి.జీ.ఎస్.వి ప్రసాద్ మరియు సచివాలయ సబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *