Breaking News

మే 29 న పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్

-పాలిసెట్ ఉదయం 11.00 నుంచి మ.1.00 వరకు ..
-తూర్పు గోదావరి జిల్లాలో 12 పరీక్షా కేంద్రాలు..
-ఉదయం 10.45 గంటలకు పరీక్షా కేంద్రం తరగతి గది లో ఉండాలి..
-డి ఆర్ ఓ .. బి. సుబ్బారావు

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లాలో మే 29 వ తేదీన నిర్వహించే పాలిటెక్నిక్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్) పరీక్షలను సజావుగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా రెవెన్యూ అధికారి బి. సుబ్బారావు పేర్కొన్నారు.

మంగళవారం పాలిసెట్ ఎంట్రెన్స్ టెస్ట్ ఏర్పాట్లు పై స్థానిక కలెక్టర్ లో పాలీటెక్నిక్ ఎగ్జామినర్, అధికారులతో డిఆర్ఓ సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ పాలిసెట్ 2022 ప్రవేశ పరీక్షల నిర్వహణ పై సంబంధిత అధికారులతో జిల్లాకలెక్టర్ సూచనలు మేరకు కోఆర్డినేషన్ సమావేశం ఏర్పాటు చేసామన్నారు. మే 29 న ఉదయం 11.00 గంటల నుంచి మ.1.00 గంట వరకు నిర్వహించే ప్రవేశ పరీక్షకు ఉదయం 10.45 కల్లా పరీక్షా గదిలో ఉండాలన్నారు. పరీక్షల నిర్వహణకు నియమించబడిన చీఫ్ సూపరింటెండెంట్ల్లు, జాయింట్ కోఆర్డినేటర్ లకు డిపార్టుమెంటల్ అధికారుల శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు.

జిల్లాలో 5,220 మంది విద్యార్థులు ఈ ప్రవేశ పరీక్షలకు హాజరు కానున్నారని, ఇందుకు 12 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తూర్పు గోదావరి జిల్లాలో రాజమహేంద్రవరం లో 12 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

పోలీస్ శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో ఎక్కడ కూడా జిరాక్స్ కేంద్రాలు తెరవకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణలో భాగంగా రెవెన్యూ, విద్యా శాఖల ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్లను, సిట్టింగ్ స్క్వాడ్లను ఏర్పాటు చేయాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, టాయిలెట్లు, ఫర్నిచర్, తదితర మౌలిక సదుపాయాలకు సంబంధించి ముందస్తుగా చెక్ లిస్ట్ ఏర్పాటుచేసుకుని ఆ మేరకు ఏర్పాట్లను పూర్తి అయ్యిందని తెలిపారు.

వైద్య ఆరోగ్య శాఖ ద్వారా పరీక్షా కేంద్రాల్లో ప్రాథమిక చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేయాలని వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు చేశారు. పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు ఆర్టీసి ద్వారా సౌకర్యవంతంగా ఆయా రూట్ల లో బస్సులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాలకు ప్రశ్నాపత్రాలను పంపిణీకి అవసరమైన వాహనాలను రవాణా శాఖ ద్వారా సిద్దం అయినట్లు తెలిపారు.

ఈ సమావేశానికి ఎంట్రన్స్ పరీక్షల చీఫ్ పర్యవేక్షకులు, పాలిటెక్నిక్ ప్రిన్సిపల్ వి. నాగేశ్వర రావు, మెకానికల్ హెచ్ ఓ డి జీ. జగన్మోహన్ రావు, డి ఎమ్ హెచ్ ఓ ఎమ్.స్వర్ణలత, పోలీసు, రెవెన్యూ, విద్యా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *