-డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ అద్వర్యంలో గవర్నర్ పేట ఐ.వి.ప్యాలస్ నందు పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన ఉచిత ఆరోగ్య శిబిరమును నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ప్రారంభించి కార్మికులకు అందిస్తున్న పరీక్షలను పరిశీలించారు. ఈ సందర్భంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ మాట్లాడుతూ కార్మికుల ఆరోగ్య భద్రతకై నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తున్న ఇటువంటి ఆరోగ్య శిబిరములను కార్మికులు సద్వినియోగ పరచుకోవాలని అన్నారు. కార్మికల యొక్క ఆర్ధిక సిత్దిగతుల మరియు వారి యొక్క ఆరోగ్య విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించి ఆంద్ర హాస్పిటల్ యాజమాన్యం మరియు డెంటల్ అసోసియేషన్ వార్లు ఉచితంగా చేస్తున్నారని అన్నారు. నగరపాలక సంస్థ చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఇన్ ఛార్జ్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్ మాట్లాడుతూ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ వారి ఆదేశాలకు అనుగుణంగా మరిన్ని ఆరోగ్య శిబిరములు ఏర్పాటు చేయుట జరుగుతుందని అన్నారు. ఈ సందర్భంగా పలువురు కార్మికులు తమ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధను కనపరచి ఖర్చుకు వెనుకాడక నిపుణులైన వైద్యులచేత పరీక్షలు చేయించుచున్న కమిషనర్ కి కృతజ్ఞతలు తెలియజేసారు. కార్యక్రమములో నగరపాలక సంస్థ హెల్త్ ఆఫీసర్ డా.రామకొటేశ్వరరావు, ఆంధ్ర హాస్పిటల్స్ వైద్య నిపుణులు, డెంటల్ అసోసియేషన్ డాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News