విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహనీయుడు రాజ్యాంగ నిర్మాత ప్రతి ఒక్కరికి ఆదర్శమైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుని వివాదాల్లోకి లాగి వారిని అవమానించిన వైయస్సార్సీపి ప్రభుత్వ తీరుకు నిరసనగా జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఆధ్వర్యంలో చిట్టినగర్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టేందుకే కావాలని కోనసీమలో వైయస్సార్ సిపి నాయకులు కార్యకర్తలు అలజడులు సృష్టిస్తున్నారని, రాజకీయ లబ్ది పొందాలని ఈ మరకను ఇతర పార్టీలకు అంటీ స్తున్నారని, ప్రభుత్వ పెద్దల కనుసన్నలలోనే ఈ విధ్వంసం జరిగిందని , విధ్వంసం లో పాల్గొన్న అనేక మంది సజ్జల lరామకృష్ణా రెడ్డి తో కలిసి ఫోటోలు దిగారని ఆత్మహత్య ప్రయత్నం చేసిన సాయి అనే వ్యక్తి సజ్జల వారితో సన్నిహితంగా ఉండే ఫోటోలు కూడా సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతున్నా యని, కాకినాడలో ఎమ్మెల్సీ అనంత బాబు చేసిన హత్య కేసును పక్కదారి పట్టించాలని, వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల బస్సుయాత్రకు ఆదరణ పెంచుకోవాలనే ఇ టువంటి కుట్రలకు పాల్పడ్డారని, సీఎం జగన్మోహన్ రెడ్డి సూచనల తోనే సజ్జల రామకృష్ణారెడ్డి అమలాపురంలో ఈ పథకాన్ని అమలు చేసే అలజడి సృష్టించారని, ఉదయం నుంచి నిరసనకారులను నియంత్రించిన పోలీస్ శాఖ వారు మధ్యాహ్నం నుంచి ఎందుకు వదిలేశారో సమాధానం చెప్పాలని, ఆందోళన కారులు పెద్ద సంఖ్యలో ఉన్నారని తెలిసికూడా పోలీస్ శాఖ ఎందుకు చూసీచూడనట్లుగా వ్యవహరించిందని , ఇంటెలిజెన్స్ స్పెషల్ బ్రాంచ్ వైఫల్యం చెందాయ లేక ప్రభుత్వ పెద్దలు ఆదేశాలతోనే పోలీస్ శాఖ వారు ఆందోళన కారులను వదిలేశారా అనే అనుమానం కలుగుతుందని, ముందస్తు సమాచారంతోనే పిన్నెల్లి విశ్వరూప్ ని వారి కుటుంబ సభ్యులకు కాపాడిన పోలీసులు ఆందోళనకారులను నియంత్రించేందుకు ఎందుకు వైఫల్యం చెందారు సమాధానం చెప్పాలని, అల్లర్లు సృష్టించి కావాలని జనసేనకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని ఇవన్నీ ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, అమలాపురం లో జరిగిన అల్లర్లకు జనసేన పార్టీకి ఎటువంటి సంబంధం లేదని, అంబేద్కర్ పేరు ని రాజకీయంగా వాడుకొని లబ్ది పొందాలనే చేస్తున్న వైఎస్ఆర్సిపి కుట్రలను ప్రజాస్వామ్య వాదులందరూ తిప్పికొట్టాలని, ప్రజల మధ్య కులాల పేరుతో మతాల పేరుతో విధ్వంసం సృష్టించాలని వైఎస్ఆర్సిపి పార్టీ చేస్తున్న కుట్రలను రాష్ట్ర ప్రజలందరూ గ్రహించి ఈ పార్టీకి తగిన రీతిలో బుద్ధి చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సోమీ గోవింద్, దోమ గుంట అశోక్ , బత్తుల. వెంకటేష్,కొర్ర గంజి వెంకటరమణ,రెడ్డిపల్లి గంగాధర్, ,శిగినంశెట్టి రాము, తమ్మిన లీనా కరుణాకర్, నగర కమిటీ సభ్యులు, ఆకారపు విజయ్ కుమారి, మోబిన్, గన్ను శంకర్, జనసేన నాయకులు స్టాలిన్,బాదరాల శివ, రాళ్లపుడి గోవింద్, తమ్మిన రఘు, అడ్డ గిరి పుల్లారావు,బావి శెట్టి శ్రీనివాస్, పోలిశెట్టి శివ, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News