Breaking News

రోడ్డు ప్రమాదాల కారణాలను గుర్తించి మరణాలను నివారించండి…

-ప్రమాదాలపై ప్రతీ 15 రోజులకు సమగ్ర సమీక్ష నిర్వహించండి…
-జిల్లా కలెక్టర్‌ యస్‌డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో అధికారుల సమన్వయంతో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రమాదాల రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు సంబంధిత అధికారులకు సూచించారు. ప్రమాదాల నివారణ పై జాతీయ రహదారులు, ఆర్‌అండ్‌బి, రవాణా శాఖ, పోలీసు అధికారులతో శుక్రవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు రహదారి భద్రత కమిటీతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహిచారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ ఏడాది జనవరి నుండి ఏప్రిల్‌ వరకు జాతీయ, ఆర్‌అండ్‌బి రహదారులపై 489 రోడ్డు ప్రమాదాలు జరగగా 123 మంది మరణించారని, 457 మంది క్షతగాత్రులు అయ్యారని కలెక్టర్‌ అన్నారు. ప్రమాదాలు అధికంగా ఉదయం 6 నుండి 9 గంటలలోపు, రాత్రి 9 గంటల నుండి 12 గంటల మధ్యలో ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. జరిగిన ప్రమాదాల పై అధికారులు నిర్థిష్టమైన విచారణ చేపట్టాలన్నారు. గత 15 రోజులలో జరిగిన ప్రమాదాలలో సాంకేతిక కారణాలపై సమగ్ర విచారణ చేసి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవలన్నారు. తరచు ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి నివారణకు వెంటనే చర్యలు చేపట్టి నివేదికను సమర్పించాలన్నారు. పరిటాల` కంచికచర్ల మైలవరం`జి కొండూరు జాతీయ రహదార్లకు గ్రామాలను కలిపే అప్రోచ్‌ రోడ్లు వద్ద స్పీడ్‌ బేకర్లు, డంబుల్‌ స్ట్రిప్స్‌ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ రహదారి డివైడర్‌ మధ్య మొక్కలను నాటి సంరక్షించేలా జాతీయ రహదారి అధికారులు పర్యవేక్షించాలన్నారు. వాహన దారులకు డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించి మద్య సేవించి వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతోపాటు వాహనాలు స్వాధీనం చేసుకోవాలని ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. మైనర్లు వాహనాలు నడిపినట్లయితే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలన్నారు. హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌, సిగ్నిల్‌ రూల్స్‌ పాటించని, నో పార్కింగ్‌ వద్ద వాహనాలు పార్కింగ్‌ చేసిన వారిపై జరిమానా విధించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు సంభవించినప్పుడు తక్షణమే వైద్యం అందించేలా నగరంలోని జిజిహెచ్‌లో అత్యవసర విభాగాన్ని పూర్తి సౌకర్యాలతో సిద్దంగా ఉంచాలని కలెక్టర్‌ వైద్యాధికారులకు సూచించారు. రోడ్డు భద్రత పై కర్రపత్రాలు ముద్రించి విసృత్తంగా ప్రచారం చేయడం ద్వారా ప్రజలను చైతన్యవంతులు చేయలని కలెక్టర్‌ అధికారులకు సూచించారు. గూగుల్‌ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌, డిటిసి పురేంద్ర, నేషనల్‌ హైవే పిడి నారాయణరావు, ఆర్‌అండ్‌బి ఎస్‌ఇ శ్రీనివాస్‌ మూర్తి, డియంహెచ్‌వో డా. యం.సుహసిని, జిజిహెచ్‌ సూపరిండెంటెంట్‌ డా. బి. సౌభాగ్యలక్ష్మి, పోలీస్‌ అధికారులు, స్వచ్చంద సంస్థల ప్రతినిధులు రాంమోహన్‌రావు, వాసు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *