విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గ్రామీణ వైద్యుల సంఘం 117/16 రిజిస్ట్రేషన్ ద్వారా మాత్రమే సబ్యులు గా ఉంటారని, ఏ ఇతర సంఘాల ద్వారా సీనియారిటీ సంపాధించలేరని గ్రామీణ వైద్యుల సంఘం కడపాటి ఉపాధ్యక్షులు రవిచంద్ర అన్నారు. ఈ మేరకు సోమవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో తమ సంఘాన్ని దివంగత రాజశేఖర్ రెడ్డి గుర్తించారని, తాము శిక్షణా కాలం పూర్తి చేసుకుని ఉన్నామన్నారు. కాని ఈ సంవత్సరం ఏప్రిల్ నెలలో నూతన సంఘం ఏర్పడిందని వాళ్ళు విడిపోయి దొంగ సర్టిఫికెట్ లతో 45/22 సంఘం ఏర్పాటు చేసుకొన్నారని ఆరోపించారు. ఈ నూతన సంఘం పాత సర్టిఫికేట్లు చెల్లవని నూతన సర్టిఫికెట్ లు ఇస్తామని నమ్మబలుకుతూ మోసం చేస్తున్నారని వాళ్ళ సంఘం లో చేరి సీనియర్టీ ని పోగొట్టుకోవద్దని సూచించారు. సమావేశంలో గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. సురేష్ బాబు, కార్యదర్శి హేమ సుందర్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News