Breaking News

జిల్లాలో ఈనెల 13 నుండి 28 వరకు డయేరియా నివారణ పక్షోక్షవాల నిర్వహణ…

-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న వాతావరణంలో మార్పులు దృష్టిలో ఉంచుకుని డయేరియా వ్యాధి ప్రభలకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు వైద్య అధికారులను ఆదేశించారు. డయేరియా వ్యాధి ప్రభలకుండా చేపట్టవలసిన ముందస్తు చర్యలపై వైద్య ఆరోగ్య, ఆర్‌డబ్ల్యుఎస్‌, పంచాయతీరాజ్‌, శిశుసంక్షేమ శాఖాధికారులతో శనివారం జిల్లా కలెక్టర్‌ నగరంలోని ఆయన కార్యాలయం నుండి టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగాయ ఆయన మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు చిన్నారుల్లో ముమ్మర నీళ్ళ విరోచనాల వ్యాధుల నివారణ పక్షోత్సవాలు నిర్వహించాలన్నారు. వేసవికాలం అనంతరం వాతావారణంలో చోటు చేసుకునే మార్పుల వలన ప్రజలు వాంతులు, విరోచనాలు వంటి వాటికి గురి అయి డయేరియా వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. దీనిని అరికట్టేందుకు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు ప్రజలను చైతన్యవంతులుగా చేయాలన్నారు. ఈనెల 13వ తేది నుండి 27 వతేదీ వరకు తీవ్రమైన డయేరియా నివారణ పక్షోక్షవాలు( ఇన్‌టెన్సిఫైడ్‌ డయేరియా కంట్రోల్‌ ఫోర్డ్‌నైట్‌ ) నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందులో భాగంగా ప్రజలు తీసుకునే ఆహర పదార్థాలు, త్రాగునీటిపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలన్నారు. ముఖ్యంగా మురికి వాడలు, అట్టడుగు వర్గాల పేదల నివాసిత ప్రాంతాలపై ప్రత్యేక శ్రద్ద వహించి వారికి పరిసరాల పరిశుభ్రత పై అవగాహన కల్పించాలన్నారు. చిన్నారుల్లో డయేరియా లక్షణాలు గుర్తిస్తే తల్లిదండ్రులు వెంటనే చేపట్టవలసిన రక్షణ చర్యలను వివరించి వ్యాధి నివారణకు కృషి చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, సంక్షేమ హాస్టల్స్‌ ద్వారా అందించే ఆహారం హోటల్స్‌, ఫుడ్‌కోర్స్టు, రైల్వేస్టేషన్‌, బస్‌స్టేషన్‌లలో విక్రయించే ఆహార పదార్థాలను ఫుడ్‌ కంట్రోలింగ్‌ అధికారులు ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా పరిశీలించి నిర్వహకులు నాణ్యత ప్రమాణాలతో ఆహార పదార్థాలు విక్రయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు సరఫరా చేసేలా చర్యలు తీసుకోవాలని, త్రాగునీటి పైపులైన్‌ల లీకేజ్‌ లేకుండా చూడాలన్నారు. ఒఆర్‌ఎస్‌ ఒక ప్యాకెట్‌ను ఒకేసారి కాకుండా రెండు దఫాలుగా తీసుకుంటేనే ప్రయోజనం ఉంటుందనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. డయేరియా వ్యాధికి గురి అయిన వారికి స్థానికంగానే ప్రాధమిక చికిత్స అందించి వ్యాధిని నివారించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తీవ్రతరమై సిలైన్‌ ఇవ్వవలసి వస్తే సమీపంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స అందించాలన్నారు. ప్రభుత్వం ప్రాధమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక మౌలిక వసతులు, సిబ్బంది మందులను అందుబాటులో ఉంచడం జరిగిందని డయేరియా వలన ఏ ఒక్కరూ ప్రాణహానికి గురి అయిన సంఘనట జిల్లాలో నమోదు కాకుడదని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు వైద్య అధికారులకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *