విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అరసవిల్లి అరవింద్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత అరసవిల్లి అరవింద్ పుట్టిన రోజు సందర్భంగా శనివారం విజయవాడలో 200 మంది అన్నార్థులకు భోజనం ప్యాకెట్లు వితరణ చేశారు. అలాగే కృష్ణ లంక వల్లూరి వారి వీధిలో గల ప్రజ్వల ఓపెన్ షేడ్ అనాథ శరణాలయం నందు గల బాలికలకు ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ నీలిమ మరియు రామ్చంద్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందని ఒక ప్రకటన లో తెలియజేశారు. ప్రజ్వల ఓపెన్ షేడ్ వార్డెన్ సంధ్య తమ వద్ద ఉన్న పిల్లల కొరకు వైద్య శిబిరం ఏర్పాటు చేసినందుకు అరసవిల్లి అరవింద్ కి కృతజ్ఞతలు తెలియజేశారు.
Prajavartha Online Telugu News