Breaking News

ఆరోగ్యమునకు ఆహ్లాదకర వాతావరణం అవసరం

-మాస్ ప్లాంటేషన్ కార్యక్రమములో చీఫ్ ఎలక్టోరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్భంగా నగరపాలక సంస్థ 35వ డివిజన్ సి.కె రెడ్డి రోడ్ ఏలూరు కాలువ గట్టు వెంబడి ఏర్పాటు చేసిన మాస్ ప్లాంటేషన్ కార్యక్రమములో ముఖ్య అతిధులుగా చీఫ్ ఎలక్టోరల్ అధికారి (CEO) ముఖేష్ కుమార్ మీనా, ఐ.ఏ.ఎస్, జిల్లా కలెక్టర్  డిల్లిరావు, ఐ.ఏ.ఎస్., నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు, నగర కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్ మరియు ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొని మొక్కలు నాటారు. అదే విధంగా ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్లాస్టిక్ వాడకం నిషేధంపై నిర్వహించిన ర్యాలీని శాసన సభ్యులు ప్రారంభించారు.

ఈ సందర్భంగా ముఖేష్ కుమార్ మీనా మాట్లాడుతూ ప్రజలు ఆరోగ్యంగా జీవించాలంటే ఆహ్లాదకరమైన వాతావరణం ఎంతో అవసరమని ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగరపాలక సంస్థ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించే దిశగా పెద్ద ఎత్తున మెక్కలు నాటే కార్యక్రమము ఏర్పాటు చేయుట మరియు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్ వంటి సౌకర్యాలు కల్పించుట ఎంతో అభినందనీయమని పేర్కొన్నారు. నగర ప్రజలకు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసారు.

జిల్లా కలెక్టర్  డిల్లిరావు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవము సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమము నిర్వహించుట హర్షించదగినదని, గతంలో ఈ ప్రాంతము పూర్తిగా వ్యర్దములతో ఉండేదని, రాభోవు రోజులలో ఈ ప్రాంతము ఎంతో సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటుందని, మొక్కలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని, మొక్కలను కాపాడుట అందరి భాద్యత అని పేర్కొన్నారు. అదే విధంగా రేపు జరగనున్న సైక్లోథాన్, వాకథాన్, మహిళల సైక్లోథాన్ వంటి అనేక కార్యక్రమములు నగరపాలక సంస్థ నిర్వహిస్తుందని ప్రజలు ఈ కార్యక్రమములో పాల్గొనాలని పిలుపునిచ్చారు.

అదే విధంగా నగరంలో అధిక మొత్తంలో ప్లాస్టిక్ వాడకం వాటిని సైడ్ డ్రెయిన్స్ లలో పడవేయటం వల్ల మురుగునీటి పారుదలకు మరియు నగర సుందరికరణకు తీవ్ర అవరోధం ఏర్పడుతుందని, ప్రజలందరూ భాద్యతగా ప్లాస్టిక్ వాడకాని తగ్గించాలని మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి అన్నారు. ప్లాస్టిక్ వినియోగం నివారించాలనే ఉద్దేశ్యంతో ప్రజలకు అవగాహన కల్పించే దిశగా ర్యాలి కూడా నిర్వహించుట జరిగిందని అందరి సహకారంతో మన నగరం ప్లాస్టిక్ రహిత నగరంగా తీర్చిదిద్దుటలో స్వచ్చందంగా భాగస్వాములు కావాలని శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు పేర్కొన్నారు.

కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ నగరంలో పచ్చదనం పెంపొందించాలి అంటే ప్రధానంగా కాలువగట్లు ఎంతో దోహదకారిగా ఉన్నాయని ఇప్పటికే అనేక ప్రాంతాలలో గ్రీనరి అభివృద్ధి పరచినట్లు, ఇదే స్పూర్తితో వ్యాపార సంస్థల వారు తమ షాపుల ముందు కుండిలతో మొక్కలు ఏర్పాటు చేసుకోవాలని, పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని అన్నారు.

కార్యక్రమములో స్థానిక కార్పొరేటర్ బలసాని మణిమ్మతో పాటు పలువురు కార్పొరేటర్లు మరియు నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *