Breaking News

కాలుష్య రహిత సమాజ స్థాపన ప్రతి ఒక్కరి లక్ష్యం…

-పర్యావరణాన్ని కాపాడుదాం – ఆహ్లాదకరమైన వాతావరణం కల్పిద్దాం
-రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని విజయవాడ నగరపాలక సంస్థ ఆద్వర్యంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమములలో గౌరవ రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ డిల్లిరావు, ఐ.ఏ.ఎస్., నగర మేయర్  రాయన భాగ్యలక్ష్మి, శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు, మల్లాది విష్ణువర్ధన్, నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, పోలీస్ కమిషనర్  టి.కాంతి రాణా ఐ.పి.ఎస్, డిప్యూటీ మేయర్  అవుతు శ్రీశైలజా రెడ్డి పాల్గొని ఇందిరాగాంధీ స్టేడియం ఈట్ స్ట్రీట్ నుండి సైక్లోథాన్, తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రం నుండి వాకథాన్ మరియు మహిళల సైక్లోథాన్ వంటి కార్యక్రమములను ప్రారంభించగా ప్రజల నుండి చక్కటి స్పందనతో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి  ఆలోచన నుండి ఉద్బవించిన జగనన్న స్వచ్చ సంకల్పo వంటి ఉన్నతమైన ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళే భాగంలో రాష్ట్రంలో ఏడాది పాటు ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమములు నిర్వహించేలా చర్యలు తీసుకోవటం జరిగింది. పంచభూతాలలో భూమి ఎంతో ప్రముఖమైనది, భవిష్యత్ తరాల వారికీ మంచి వాతావరణం అందించాలి అంటే భూమిని మనం కాపాడుకోవాలి దానికి తగిన విధంగా నేడు జిల్లా యంత్రాంగం మరియు నగరపాలక సంస్థ ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమము ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. సాలిడ్ వేస్ట్, ఎయిర్ మరియు వాటర్ పొల్యూషన్ దూరంగా ఉంచాలనే ప్రభుత్వ ఆదేశాల మేరకు మున్సిపల్ సాలిడ్ వేస్ట్ నంతటిని ట్రాన్సఫర్ స్టేషన్ ద్వారా విభజించి చెత్తను పవర్ ప్లాంట్ కు తరలించి దాని నుండి పవర్ ఉత్పత్తి చేయుట జరుగుతుందని, దీనికి ప్రజలందరూ సహకరించి తమ తమ నివాసాల వద్దనే చెత్తను విభజించి పారిశుధ్య సిబ్బందికి అందించేలా సహకరించాలని తెలియజేస్తూ, ప్రజలందరికి ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

శాసన సభ్యులు  వెలంపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పర్యావరణంపై ప్రజలకు అవగాహన కల్పించే దిశగా నగరపాలక సంస్థ ఆద్వర్యంలో రెండు రోజులు పాటు పెయింటింగ్, మాస్ ప్లాంటేషన్, సైక్లోథాన్, వాకథాన్ వంటి అనేక కార్యక్రమములు నిర్వహించుట జరిగిందని అన్నారు. గతంలో విజయవాడ నగరపాలక సంస్థ అనేక సంస్కరణలు అమలు చేస్తూ, చక్కటి అవార్డులు సాధించుట జరిగిందని, రాబోవు రోజులలలో మరిన్ని అవార్డులు సాధించుటలో ప్రజల సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. అదే విధంగా శాసన సభ్యులు మల్లాది విష్ణు మాట్లాడుతూ నగరంలో ప్లాస్టిక్ నిషేధo, మొక్కల పెంపకం, కాలుష్యాన్ని తగ్గించుట వంటి అనేక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, ప్రతి రోజు నగరంలో ఉత్పత్తి అగు చెత్తను సేగ్రిగేషన్ విధానము ద్వారా ఇంటింటి చెత్త సేకరణ, వీధులలో సి.ఎన్.జీ వాహనముల ద్వారా చెత్తను సేకరించుట వంటి అనేక కార్యక్రమములు నగరపాలక సంస్థ చేపట్టిందని అన్నారు.

ముగింపు మరియు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమము
అనంతరం ఇందిరాగాంధీ స్టేడియం ఈట్ స్ట్రీట్ నందు నిర్వహించిన ముగింపు మరియు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమములో మేయర్, కమిషనర్ మరియు డిప్యూటీ మేయర్ పోటిలలో విజేతలకు సర్టిఫికేట్, మెడల్స్ మరియు నగదు బహుమతులను అందజేసారు. ఈ సందర్భంగా నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి మాట్లాడతూ పర్యావరణ దినోత్సవo సందర్భంగా నేటి నుండి నగరoలోని ప్రతి వ్యాపార సంస్థ విధిగా వారి షాపు ముందు ఒక కుండితో మొక్కను ఏర్పాటు చేసుకొనే కార్యక్రమమునకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. గత ఏడాది క్లైమేట్ స్మార్ట్ సిటీ లో 4 స్టార్ రేటింగ్ సాదించుట జరిగిందని అదే విధంగా ఈ సంవత్సర 5 స్టార్ రేటింగ్ సాధించే దిశగా నగరపాలక సంస్థ చర్యలు చేపట్టిందని, మన నగరం కాలుష్య రహిత గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దుటలో నగర ప్రజలందరూ స్వచ్చంద భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురష్కరించుకొని నగరంలో సైక్లింగ్, వాకింగ్, ప్లాంటేషన్, పెయింటింగ్ వంటి పలు అంశాలలో ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ పలు కార్యక్రమములను ఏర్పాటు చేయుట జరిగిందని అన్నారు. విజయవాడ నగరం హరిత నగరంగా తీర్చిదిద్దుటకై పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమమునకు శ్రీకారం చుట్టి దీనిలో ప్రతి షాపు యజమాని ఒక మొక్కను షాపు ముందు ఏర్పాటు చేసుకోవాలని మరియు నివాసాల వారు కూడా తమ తమ ఇళ్ళ యందు మొక్కలు నాటి వాటిని సంరక్షించే భాద్యతను స్వచ్చందంగా చేపట్టే విధంగా చర్యలు చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమమును ఇంతటితో ఆపకుండా మరింత ముందుకు తీసుకొనిపోవలెనని, పర్యావరణ దినోత్సవ కార్యక్రమము నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసారు.

అంతర్జాతీయ యోగా శిక్షకురాలు శీరిష బృందం నిర్వహించిన యోగా సమ్మిళిత ప్రదర్శన మంత్రముగ్దులిని చేయగా యువతీ యువకులు పాటలకు అనుగుణంగా చేసిన నృత్యాలు ప్రేక్షకులను అలరించాయి. పెయింట్ యువర్ సిటీ నందు మహేష్, ప్రదీప్ టీమ్, ఫోటోగ్రాఫి నందు మురళీకృష్ణ, షార్ట్ ఫిలిమ్ నందు గోపికృష్ణ, స్లొగన్స్ నందు వి.జెనిత మరియు డ్రాయింగ్ (సీనియర్) సి.హెచ్ నిపునిశ్రీ, డ్రాయింగ్ (జూనియర్) వి.ప్రణిత మరియు వ్యాస రచన పోటిలలో యం.డి. జహ్రీన ప్రధమ స్థానంలో విజేతలుగా నిలిచారు.

కార్యక్రమములో నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) కె.వి.సత్యవతి డిప్యూటీ సిటి ప్లానర్ (ప్లానింగ్ ) జుబిన్ శిరన్ రాయ్ మరియు అందరు శాఖాదిపతులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *