Breaking News

“పచ్చదనం ఇక విజయవాడ స్వంతం“

-పచ్చదనంతో కనువిందు చేస్తున్న డివైడర్లు, కాలువగట్లు, ఆహ్లాదం, వినోదభరితంగా పార్కుల ఆధునీకరణ
-ఆహ్లాదకరంగా విజయవాడ నగరం సుందరీకరణ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రధాన రైల్వే కూడలి, నగరం పొడవునా ప్రవహించే కాలువలు, ఫ్లై ఓవర్లు, ప్రధాన వాణిజ్య కేంద్రముగా ఉన్న విజయవాడ నగరం ఇక తన రూపు రేఖలు మార్చుకొని పచ్చదనంతో కొత్తందాలు సంతరించుకొని ప్రజలకు ఆహ్లాదం అందించుచునున్నది.

ప్రజారోగ్య సంక్షేమమునకు ప్రాధాన్యత కల్పించుచూ, మారుతున్న జీవనశైలికి అనుగుణంగా ప్రజల మానసిక, శారీరక ఆరోగ్యములను దృష్టిలో ఉంచుకొని, ముఖ్యంగా కాలుష్య రహిత విజయవాడగా తీర్చిదిద్దాలనే ధృడ సంకల్పంతో నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, పాలకమండలి మరియు అధికార యంత్రాగంతో కలసి తగు ప్రణాళికలను తయారు చేసి ఆయా అభివృద్ధి పనుల నిమిత్తం ప్రభుత్వము నుండి నిధులను సమకూర్చుకొని ఆచరణలో పెట్టుట జరుగుచున్నది.

ప్రధానంగా కాలువగట్ల సుందరీకరణ, ప్రధాన కూడళ్ళ లో 20 ఫౌంటెన్ల ఏర్పాటు, 21 డివైడర్లలో మొక్కలు నాటు కార్యక్రమమలు జూన్ నెలాఖరికి పూర్తి చేయుటకు యుద్దప్రాతిపదికన ప్రత్యేక పర్యవేక్షక బృందముల ఆద్వర్యంలో జరుగుచున్నది. ఖాళీగా ఉన్న బహిరంగ స్థలాలలో, కార్యాలయాల ఆవరణలో, రోడ్ మార్జిన్లలో మాస్ ప్లాంటేషన్ కార్యక్రమముల ద్వారా ఎవేన్యు ప్లాంట్స్ నాటుట జరుగుచున్నది. నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దవలసిన ఆవశ్యకతపై వివిధ వయస్సుల వారికీ చిత్రలేఖనం, వ్యాస రచన, సిటి పెయింటింగ్, సైక్లింగ్, వాకింగ్ వంటి పలు అంశాలలో ప్రజలను భాగస్వాములను చేసి పోటీలు నిర్వహించి వారిలో సృజనాత్మకతను వెలికితీసి హరిత నగరానికి మారు పేరు విజయవాడ అనే విధంగా అందుకు ప్రతి ఒక్కరు తీసుకొనవలసిన భాద్యత, అనుసరించవలసిన అలవాట్లపై ముఖ్యంగా యువతకు కర్తవ్య బోధ చేయు కార్యక్రమము నగరమంతటా చేపట్టబడి ప్రజా భాగస్వామ్యముతో అర్బన్ గ్రీనింగ్ కార్పోరేషన్, కాలుష్య నియంత్రణ మండలి సూచనల మేరకు నగరాన్ని గ్రీన్ సిటీ గా తీర్చిదిద్దుటకు నగరపాలక సంస్థను పర్యావరణ పరిరక్షణ చర్యలలో జాతీయ స్థాయిలో అన్ని కేటగిరీల యందు ప్రధమ స్థానములో నిలుపుటకు విశేష కృషి చేయుచున్నారు.

నగరంలో సెంట్రల్ డివైడర్ లలో నిర్జీవమైన ఎదుగుదల కాని మొక్కలను తొలగించి వాహన రద్దీని దృష్టిలో ఉంచుకొని గాలిలో కాలుష్య వాయువుల శాతం తగ్గించు నిమిత్తం డివైడర్ నందు ఏవిధమైన మొక్కలు నాటుట శ్రేయస్కరమో నిర్ణయించి, సదరు మొక్కల ఎదుగుదలకు డివైడర్ నందు నాణ్యమైన పోషకాలు కల మట్టి ఏర్పాటు చేసి మొక్కలను పేరొందిన నర్సరీల నుండి తెప్పించి నాటుట జరుగుచున్నది. ఆహ్లాదకరంగా పార్కుల నిర్వహణ, మానసిక ఉల్లాసము కొరకు, ఆరోగ్య వాతావరణం కొరకు చిన్నారుల కోసం ఆటపరికరముల ఏర్పాటు, ప్రమాణాల మేరకు వాకింగ్ ట్రాక్ నిర్మాణం, ఓపెన్ జిమ్ ఏర్పటులతో సందర్శకులను కట్టి పడేస్తున్న పార్కులు. కోట్ల రూపాయల వ్యయంతో ఫ్లై ఓవర్ వంతెనల క్రింద బ్యూటిఫికేషన్, పెయింటింగ్ పనులు చేపట్టబడినవి. రాజీవ్ గాంధీ పార్క్, రాఘవయ్య పార్కు, డా.కె.ఎల్ రావు పార్క్ వంటి అనేక పార్కులతో పాటుగా డివిజన్ స్థాయిలో ఉన్న అనేక పార్కులను ఆధునీకరించి, ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్ మరియు చిన్నారులకు వినోదభరితమైన ఆట పరికరాలలో ఆహ్లాదంగా తీర్చిదిద్దటం జరుగుతుంది. పార్క్ లలో చేపట్టిన సుందరీకరణ పనులు పూర్తి చేసి త్వరలో వినియోగం లోనికి రానున్నాయి. స్విమ్మింగ్ పూల్స్ నందు పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించుట వంటి అనేక ఆధునీకరణ పనులు చేపట్టుటయే కాకుండా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ గ్రీనరీ పెంచే విధమైన చర్యలతో మన నగరం హరిత శోభను సంతరించుకొనే విధంగా తగిన కార్యాచరణ ప్రణాళికలు మరియు అభివృద్ధికి శ్రీకారం చుట్టబడింది.

పర్యాటకంగా అభివృద్ధి దిశగా పయనం – మేయర్ రాయన భాగ్యలక్ష్మి
ప్రజల భాగస్వామ్యముతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుటకు ప్రజాప్రతినిధులందరూ నడుం బిగించి ప్రతి కార్పొరేటర్ తమ తమ డివిజన్లను మోడల్ డివిజన్లుగా తీర్చిదిద్దుటకు ప్రత్యేక కృషి చేయుచున్నాము. మంచి సలహాలు, సూచనలకు ప్రజల నుండి ఆహ్వానించుచున్నాము.

హరితహరంతో కాలుష్య రహిత నగరంగా రూపాంతరం – కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
పర్యావరణాన్ని కాపాడి భవిష్యత్ తరాల వారికీ ఆరోగ్యకర వాతావరణాన్ని అందించాల్సిన భాద్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. గ్రీన్ సిటి చాలెంజ్ కార్యక్రమములో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం. పెరుగుతున్న జనాభా, వాహన రద్దీ దృష్ట్యా కాలుష్య నియంత్రణ పై ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ఆచరించాలి. సృజనాత్మకతను వెలికి తీయుటకు నగరపాలక సంస్థ చేపట్టిన కార్యక్రమములలో అందరు పాల్గొని అవగాహన పెంపొందించుకొనవలెను.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *