Breaking News

స్పందనలో అందిన ఫిర్యాదులను సంతృప్త స్థాయిలో పరిష్కరించాలి

-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
న‌గ‌ర పాల‌క సంస్థ ప్ర‌ధాన కార్యాల‌యంలో సోమవారం స్పందన కార్యక్రమము నిర్వ‌హించారు. నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి. కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. స్పంద‌నలో ప్రజల నుండి వచ్చిన వినతులపై సంబంధిత అధికారులతో మాట్లాడి అక్కడిక్కడే కొన్ని సమస్యలను పరిష్కరించి, మిగిలిన ఫిర్యాదులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి రెండు రోజుల్లో పరిష్కరించ వలసినదిగా సంబంధిత అధికారులను అదేశించారు. నేటి స్పందనలో మొత్తం 18 అర్జీలు సమర్పించగా వాటిలో ఎస్టేట్ విభాగం – 1, ఇంజనీరింగ్ విభాగం – 3, పట్టణ ప్రణాళిక విభాగం – 10, పబ్లిక్ హెల్త్ విభాగం –1, రెవెన్యూ – 2, యు.సి.డి (పి.ఓ) – 1 విభాగాములకు సంబందించిన అర్జీలు వచ్చినవి. కార్యక్రమంలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్) శ్రీమతి కె.వి సత్యవతి, చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకర రావు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ i/c డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, సిటి ప్లానర్ జి.వి.జి.ఎస్.వి ప్రసాద్, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) డి.వెంకటలక్ష్మి మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

సర్కిల్ కార్యాలయాలలో స్పందన – 5 అర్జీలు.
సర్కిల్ కార్యాలయాలలో జోనల్ కమిషనర్లు స్పందన కార్యక్రమము నిర్వహించగా సర్కిల్ – 1 కార్యాలయంలో 3 అర్జీలు ఇంజనీరింగ్ విభాగం – 1, పట్టణ ప్రణాళిక విభాగం – 1, CDPO విభాగం – 1, సర్కిల్ – 3 కార్యాలయంలో పట్టణ ప్రణాళిక విభాగం – 2 అర్జీలు మరియు సర్కిల్ – 2 కార్యాలయంలో ఎటువంటి అర్జీలు సమర్పించి యుండలేదని జోనల్ కమిషనర్లు తెలియజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *