Breaking News

జిల్లాలో 156 కోట్లతో 372 పాఠశాలల అభివృద్ధి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో నాడు -నేడు పథకం ద్వారా పాఠశాలల అభివృద్ధి పనులను చేపట్టి త్వరితగతిన పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. రాష్ట్రంలో నాడు-నేడు రెండవ దశ పాఠశాలల అభివృద్ధి పనులపై గురువారం విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి బి రాజశేఖర్‌ జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫ్‌రెన్స్‌ నిర్వహించారు. నగరంలోని కలెక్టర్‌ కార్యాలయంలోని వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌ నుండి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 156 కోట్లతో 372 పాఠశాలలను అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొదటి దశలో రూ.78.79 కోట్లతో 341 పాఠశాలలను అభివృద్ధి చేయడం జరిగిందని తెలిపారు. రెండవ దశలో భాగంగా 156 కోట్ల రూపాయలతో 372 పాఠశాలలను అభివృద్ధి చేయడంతోపాటు 736 అదనపు తరగతి గదులను నిర్మిస్తున్నామని తెలిపారు. 20 కోట్ల రూపాయలు రివాల్వింగ్‌ ఫండ్‌ మంజూరై, విడుదల అయిందని వీటిలో 1.52 కోట్ల రూపాయలు ఖర్చు చేసి అభివృద్ధి పనులను ప్రారంభించడం జరిగిందన్నారు. ఇందుకు అవసరమైన ఇసుక సిమ్మెంట్‌ ఐరన్‌ వంటి వాటిని సిద్దం చేసేలా చర్యలు తీసుకున్నామని ఇప్పటికే పాఠశాలల డిపోల వద్దకు మెటీిరియల్‌ను సరఫరా చేయడం జరిగిందని వివరించారు. కమ్యూనిటీ కాంట్రాక్టింగ్‌ పద్దతి ద్వారా తల్లిదండ్రుల కమిటీకే పాఠశాల భవన నిర్మాణాలను అప్పగించడం వలన పారదర్శకంగా పనులను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాటు తెలిపారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులను పాఠశాల మేనేజ్‌మెంట్‌ కమిటీ సభ్యులను సమన్వయం చేసుకుని త్వరితగతిన పనులు పూర్తి చేసేందుకు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళుతున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు ప్రిన్సిపల్‌ సెక్రటరి బి రాజశేఖర్‌కు తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *