-బూత్‌లెవల్ ఆఫీసర్ల నియమాకాలను చేపట్టాలి…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఓటర్ల జాబితాకి సంబంధించి వివిధ అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనా గురువారం సచివాలయం నుండి బూత్ లెవల్ అధికారుల నియమకం, ఒటర్ల జాబితాకు సంబంధించి పలు అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎలక్ట్రోరల్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో ఎన్టిఆర్ జిల్లానుండి జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎలక్ట్రోరల్ అధికారి యస్ డిల్లీరావు, జాయింట్ కలెక్టర్ ఎస్ నూపూర్ అజయ్, డిఆర్వో కె.మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
ఈసందర్భంగా జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ విధి విధానలకు అనుగుణంగా జిల్లాలో అన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తున్నామన్నారు.బిఎల్వోలు, బిఎల్ఏలు నియామకాలకు సంబంధించి వివరాలను రాష్ట్ర ఎన్నికల అధికారికి వివరించారు. గుర్తింపు లేని రాజకీయ పార్జీలకు నోటీసులు జారీ చేయడం జరిగిందన్నారు. ఓటర్ల జాబితాకు సంబంధించి ప్రొఫార్మా 1, 2, 3,లు సమర్పించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌కుమార్ మీనాకు వివరించారు.
అనంతరం కలెక్టర్ డిల్లీరావు అధికారులతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన జిల్లాలో ఒటర్ల జాబితాలో తప్పులను సరిచేయాలని, 2019 సాధారణ ఎన్నికలకు సంబంధించి పిటీషన్లను ప్రధాన అంశాలుగా తీసుకుని పరిష్కార దిశగా చర్యలు చేపట్టాలన్నారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు, అసిస్టెంట్ బూత్ లెవెల్ ఆఫీసర్ల నియామకాలు చేపట్టాలని సూచించారు. నేషనల్ గ్రీవెన్స్ రెడ్యూసీ సిస్టం (ఎన్జిఆర్ఎస్)లోని ఫిర్యాధులను తక్షణమే పరిష్కరించాలన్నారు. ఎన్నికల నిధులకు సంబంధించి ఆడిట్ రిపోర్టులు పంపేందుకు సిద్దం చేయాలన్నారు.
సమావేశంలో డిప్యూటి ఎన్నికల తహాశీల్థార్ శ్యామ్, తదితర ఎన్నికల డిప్యూటి తహాశీల్థార్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News