-తక్షణ స్పందన బృందముల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలి
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్, క్షేత్రస్థాయి పర్యటనలో శుక్రవారం నిర్మలా కాన్వెంట్ రోడ్, మదర్ దెరిసా జంక్షన్, హోటల్ డి.వి.మ్యానర్ జంక్షన్ మొదలగు ప్రాంతాలలో పర్యటించిన సందర్బంలో నేడు కురిసిన వర్షపు నీరు కాలువల ద్వారా ప్రవహించకుండా రోడ్ల మీద నిల్వ ఉండుట గమనించి, సంబంధిత అధికారులను అప్రమత్తం చేసినారు. ప్రధానంగా ఇంజనీరింగ్, ప్రజారోగ్య మరియు పట్టణ ప్రణాళికా విభాగము వారు సమన్వయంతో పని చేసి రోడ్లపై నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని అన్నారు. నగరంలోని ప్రతి వీధిలో వర్షపు నీరు నిలిచియుండు ప్రాంతములను గుర్తించి ఎందుకు నిలిచిపోతున్నవి, పరిష్కార చర్యలపై కార్యాచరణను ఈ రోజు సాయంత్రానికి సమర్పించవలెనని అన్నారు. ప్రతి మ్యాన్ హోల్, కల్వర్ట్ మూతలు తీసి శుభ్రపరచి, నీటి పారుదల సక్రమముగా ఉండునట్లుగా చూడాలని ఆదేశించారు. అదే విధంగా పారిశుధ్య నిర్వహణకు అవరోధoగా కాలువల మీద ఆక్రమణలను తొలగించుట, డ్రెయిన్స్ నందు పూర్తి స్థాయిలో సిల్ట్ తొలగించుట, కాలువలలో చెత్త వ్యర్ధపదార్దములు పడకుండా చూడాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్బంలో తక్షణ స్పందన బృందములను ఏర్పాటుచేసి ఏవిధమైన పరిస్ధితినైనా ఎదుర్కొనుటకు సిద్దంగా ఉండాలని, కాలువలలో జల్లెడలు ఏర్పాటు చేసిన ప్రాంతములలో 24 గంటలు వర్కర్ ను ఉంచాలని అన్నారు. ఈ కార్యాచరణకు ప్రత్యేకంగా పారిశుధ్య సామాగ్రి సమకూర్చుకొనవలెనని ఏవిధమైన పరిస్ధితినైనా ఎదుర్కోనే విధంగా అప్రత్తంగా ఉండవలెనని, ప్రజలకు అసౌకర్యం కలుగకుండా చూడవలసిన భాద్యత మనపై గలదని క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, అందరిని కార్యాచరణలో ఉండునట్లు చూడవలెనని తెలిపిరి. కమిషనర్ వారి ఆదేశాలకు అనుగుణంగా అన్ని విభాగముల అధికారులు వారి వారి ప్రాంతములలో జె.సి.బి మరియు బాబ్‌కట్ సహయంతో డ్రెయిన్లు శుభ్రపరచుట, కల్వర్ట్ ల క్రింద శుభ్రపరచుటకు చర్యలు గైకొనిరి. పర్యటనలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.సి.హెచ్ బాబు శ్రీనివాసన్, డిప్యూటీ ఎగ్జీక్యూటివ్ ఇంజనీర్ మరియు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News