Breaking News

ప్రాణధారమైన జలమును సంరక్షించుకొనవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై వుంది… 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఇంకుడు గుంతలను మేయర్ రాయన భాగ్యలక్ష్మి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. ఈ సందర్బంలో రాబోయే వర్షపు కాలంలో నీరు వృధా కాకుండా నిల్చిన నీరు అంతయు పైపుల ద్వారా భూమిలోకి ఇంకేవిధంగా రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్ ను నిర్వహించాలని అన్నారు. మానవాళి మనుగడకు ప్రాణధారమైన జలమును సంరక్షించుకొనవలసిన భాద్యత ప్రతి ఒక్కరిపై కలదని, మారుతున్న వాతావరణ పరిస్ధితులలో నీటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరు గుర్తించి జాగ్రత్త పడాలని అన్నారు. ప్రకృతిపరంగా లభించు వర్షపు నీటిని ఒడిసి పట్టుకొని ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవటం ద్వారా భూగర్భ జలాలను పెంచాలని తద్వారా భవిష్యత్ తరాలకు మంచి వాతావరణం అందించిన వారము అవుతామని ప్రతి ఒక్కరు అవకాశం ఉన్నంత వరకు తమ ఇంటి ఆవరణలో చిన్న ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *