Breaking News

అభివృద్ధి పనులను సత్వరమే పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సర్కిల్ -3 పరిధిలోని పలు పాఠశాలలో చేపట్టిన ఇంజనీరింగ్ అభివృద్ధి పనులను నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, క్షేత్రస్థాయిలో పర్యటించి అధికారులను వాటి వివరాలు అడిగి తెలుసుకొని పలు సూచనలు చేసారు. పటమట ప్రాంతములోని జి.డి.ఇ.టి మున్సిపల్ స్కూల్, పటమట లంక వి.యం.సి ప్రాధమిక పాఠశాల, వల్లూరి సరోజినీ దేవి నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాల, సంజయ్ గాంధీ కాలనీ నందలి దామోదర సంజీవయ్య నగరపాలక సంస్థ పాఠశాల, న్యూ ఆర్.టి.సి కాలనీ మున్సిపల్ ప్రాధమిక పాఠశాలలో నాడు నేడు ద్వారా చేపట్టిన పనులతో పాటుగా ఆయా పాఠశాలలో చేపట్టిన తరగతి గదుల మరమ్మత్తులు, టాయిలెట్స్, వంటశాల ఆధునీకరణ వంటి ఇతర ఇంజనీరింగ్ పనుల వివరాలను సంబందిత అధికారులను అడిగితెలుసుకొన్నారు. ఈ సందర్బంలో పాఠశాలలో చేపట్టిన అన్ని పనులు వేగవంతము చేసి సత్వరమే పూర్తి చేయుటకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పర్యటనలో చీఫ్ ఇంజనీర్ యం.ప్రభాకరరావు, అదనపు కమిషనర్(ప్రాజెక్ట్స్) కె.వి సత్యవతి, సూపరింటిoడెండింగ్ ఇంజనీర్ (వర్క్స్) పి.వి.కె భాస్కర్, డిప్యూటీ ఎడ్యుకేషన్ అధికారి i/c కె.వి.ఆర్.ఆర్ రాజు మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *