Breaking News

దివ్యాంగ విద్యార్థుల మాటలకు చెలించి కంటనీరు పెట్టిన కలెక్టర్‌…

-వీూ లాంటి కష్టం ఎవరికి రాకూడదు… మీకు ఎప్పుడూ అండగా ఉంటా…
-సంక్షేమ వసతి గృహాలు పునరావాస కేంద్రాలపై పటిష్టపర్యవేక్షణ ఏర్పాటు చేస్తాం…
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అన్నమ్మ దివ్యాంగుల పాఠశాల విద్యార్థులకు వచ్చిన కష్టం మరెవరికి రాకూడదని భాధిత విద్యార్థులకు అండగా ఉంటామని అధికారులతో కమిటీని ఏర్పాటు చేసి సంక్షేమ వసతి గృహాలు పునరావాస కేంద్రాలను నిరంతరం పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు.
గుణదల విజయమేరీ బ్లయిండ్‌ స్కూల్‌లో పునరావాసం పొందుతున్న ఇబ్రహీంపట్నం అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలకు చెందిన విద్యార్థులతో బుధవారం జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు ముచ్చటించి వారి నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నేను మీకు అన్నలాంటి వాడనని ఎటువంటి సందేహం లేకుండా అన్నమ్మ దివ్యాంగుల పాఠశాలలో ఏమి జరిగిందో తెలియజేయమని కలెక్టర్‌ భాధిత విద్యార్థులను అప్యాయంగా అక్కునచేర్చుకున్నారు. పాఠశాల యాజమాన్యం తమ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవారని ఈ విషయంపై ఏవరికైనా చెబుదామంటే కొట్టేవారని సరైన భోజనం కూడా పెట్టేవారు కాదని కలెక్టర్‌కు వివరిస్తూ… విలపించిన విద్యార్థులను చూసి చలించిన కలెక్టర్‌ కంటనీరు పెట్టారు. విద్యార్థులతో ముచ్చటించిన అనంతరం జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ తల్లిదండ్రులకు దూరమై దివ్యాంగులుగా జీవనం కొనసాగిస్తున్న చిన్నారులకు ఇటువంటి బాధలు ఎదురు కావడం దురదృష్టకరమన్నారు. ఇటువంటి కష్టం మరెవరికి రాకూడదన్నారు. దివ్యాంగులకు సేవ చేయడం భగవంతునికి సేవ చేసినట్లేనన్నారు. అంకిత భావంతో కన్నబిడ్డలవలే అక్కునచేర్చుకోవాల్సిన వారే అసభ్యంగా ప్రవర్తించడం నీచాతినీచమన్నారు. జరిగిన సంఘటన పై కేసు నమోదు చేసి విచారణ అనంతరం నింధుతులను కఠినంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జువెనైల్‌ జస్టిస్‌ హైకోర్టు కమిటీ సమావేశంలో ఈ విషయంపై చర్చించడం జరిగిందన్నారు. ఇటివంటి సంఘటనలు పునరావాసం కాకుండా అన్ని వసతి గృహాలు, పునరావాస కేంద్రాలపై గట్టి నిఘాను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. రెవెన్యూ, పోలీస్‌, శిశుసంక్షేమం, చైల్డ్‌లైన్‌ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. నిస్సహాయ స్థితిలో ఉన్న బాలలు చైల్డ్‌ లైన్‌ నెంబర్‌ 1098, పోలీస్‌ 100, మహిళాహెల్ప్‌లైన్‌ 181 ఎస్‌వోఎస్‌కి కాల్‌ చేసి సహాయం పొందడంతోపాటు, అసౌకర్యంగా ఉన్న పిల్లలు సమీపంలో ఉన్న బందువులు, పెద్దల సహాయం తీసుకునేలా ‘‘అరవండి` పరిగెత్తండి` చెప్పండి పోస్టర్లు ‘‘గుడ్‌ టచ్‌ మరియు బ్యాడ్‌ టచ్‌’’ల మధ్య వ్యత్యాసంపై రూపొందించిన వీడియో ద్వారా చైతన్యవంతులను చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలు, కళాశాలల తరగతి గదులలో స్కూల్‌, కళాశాలల బస్సులలో, విభిన్నప్రతిభావంతులకు ఆశ్రయం ఇస్తున్న వసతి గృహాలు, విద్యార్థులు, ఉద్యోగల వసతి గృహాలలోను స్పెషల్‌ చిల్డ్రన్‌ హోమ్‌లు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ వార్డు సచివాలయలు, ఎగ్జిబిషన్‌, బస్టాండ్‌, రైల్యేస్టేషన్‌లు షాపింగ్‌ మాల్స్‌లలో శాశ్వతంగా ఉండేలా పోస్టర్లను ఏర్పాటు చేయాలని జువెనైల్‌ జస్టిస్‌ హైకోర్టు కమిటీ న్యాయమూర్తులు సూచించడం జరిగిందని వారి సూచనలను త్వరితగతిన ఆచరణలోనికి తీసుకురానున్నట్లు కలెక్టర్‌ డిల్లీరావు తెలిపారు.
కలెక్టర్‌ వెంట ఐసిడిఎస్‌పిడి జి ఉమాదేవి, యంఆర్‌వో దుర్గాప్రసాద్‌, ఫోరంఫర్‌ చైల్డ్‌లైన్‌ జిల్లా కో`ఆర్జినేటర్‌ అరవ రమేష్‌, విజయమేరీ బ్లయిండ్‌ స్కూల్‌ నిర్వహుకులు అమల, రాజరాజేశ్వరి, ఫిలో, కల్పన, విజి తదిరతులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *