Breaking News

జిల్లా ఆసుపత్రిని తనిఖీ చేసిన కలెక్టర్

-ప్రజలకు అందుతున్న వైద్య సేవలపై వాకబు
-గర్భిణీ మహిళతో కలెక్టర్ మాట మంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం నుండి శనివారం వరకు మ.2 గం. నుండి 4 గం. వరకు అందచేస్తున్న సూపర్ స్పెషాలిటీ వైద్యులు ద్వారా ఓ పీ సేవలు పై ప్రజల స్పందన ఎలా ఉందని కలెక్టర్ మాధవి లత ప్రశ్నించారు. శుక్రవారం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా మాధవీలత, ఆసుపత్రిలో వైద్య పరీక్షలు కోసం వచ్చిన మహిళతో ఇక్కడి వైద్య సేవలు అందించే విషయం పై ప్రశ్నిస్తూ, ఇది తొలి కాన్పే నా అని అడిగారు. కాదు ? రెండవది అని, తొలి కాన్పు సాధారణ డెలివరీ అయిందని ఆమె తెలిపారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో బాగా చూస్తున్నారని చెప్పడం తో ఇక్కడికి వచ్చానని కలెక్టర్ కి చెప్పారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహరం అందుతోందా లేదా అని అడిగారు. ఆసుపత్రి వైద్యులను ఆసుపత్రికి వచ్చే పేషెంట్ వివరాలు పై అడుగుతూ స్పేషలిస్ట్ వైద్య సేవలు గురించి ఆసుపత్రికి వొచ్చే వారికి తెలుపుతూ, ఏ ఏ రోజుల్లో ఏ ఏ విభాగాలను చెందిన డాక్టర్లు అందుబాటులో ఉంటారో బోర్డ్ ల ద్వారా ప్రదర్శించాలని ఆదేశించారు. హెల్ప్ డెస్క్ వద్ద కూడా సంబందించిన సమగ్రమైన సమాచారాన్ని అందుబాటులో ఉండే విధంగా చూసుకోవాలని ఆదేశించారు. హాస్పటల్ సూపరిండెంట్ డాక్టర్ బి.ఎస్ కుమార్, డి సి హెచ్ డాక్టర్ సనత్ కుమారి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అవుట్‌ఫాల్ డ్రెయిన్ల డీసిల్టింగ్ పనులను పరిశీలించిన కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం ఉదయం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *