Breaking News

బోధన వైద్య కళాశాల / ఆసుపత్రి పనులను పరిశీలించిన కలెక్టర్

-అక్టోబర్ నాటికి పి ఈ బి (PRE- ENGINEERED BUILDINGS) స్ట్రక్చర్ పనులను పూర్తి చేయాలి
-కలెక్టర్ మాధవి లత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
రాజమహేంద్రవరంలో రూ.475 కోట్లతో నిర్మాణం చెప్పట్టనున్న బోధన వైద్య కళాశాల / ఆసుపత్రి మేక్ షిఫ్ట్ పనులను జాతీయ మెడికల్ కౌన్సిల్ బృందం పర్యటన కంటే ముందే సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ కె మాధవి లత స్పష్టం చేశారు.

రాజమహేంద్రవరంలో నిర్మాణంలో ఉన్న భోధనా వైద్య కళాశాల “మేక్ షిఫ్ట్ – పిఈబి” పనులను జిల్లా కలెక్టర్ డా. కె. మాధవిలత శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ తూర్పు జిల్లా ప్రధాన కేంద్రమైన రాజమహేంద్రవరం లోని జిల్లా ప్రధాన ఆస్పత్రి ప్రాంగణంలో రూ. 475 కోట్లతో 150 మంది వైద్య విద్యార్థుల కోసం బోధనా వైద్య కళాశాల, ఆసుపత్రి నిర్మాణం పనులను నిర్ణీత సమయం లోగా చేయాలని పేర్కొన్నారు. నవంబర్ / డిసెంబర్ మాసాల్లో జాతీయ మెడికల్ కౌన్సిల్ టీచింగ్ మెడికల్ కాలేజి పనులను పరిశీలించేందుకు పర్యటన చేయునున్న నేపథ్యంలో అక్టోబర్ నాటికల్లా నిర్దిష్టమైన రీతిలో పనులను పూర్తి చేయాల్సి ఉందన్నారు. మేక్ షిఫ్ట్ మెడికల్ కాలేజీ కి అనుగుణంగా చేపడుతున్న పనులను జాతీయ మెడికల్ కౌన్సిల్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా చేపట్టాల్సి ఉందన్నారు.

భవన నిర్మాణ మ్యాప్ ను , ప్రి- ఇంజనీరింగ్ భవనం లో జరుగుతున్న పనుల వివరాలను అధికారులు వివరించారు. టీచింగ్ హాస్పిటల్ నిర్మాణం లో భాగంగా టీచింగ్ స్టాఫ్ క్వార్టర్స్, మెడికో హాస్టల్స్, నర్స్ హాస్టల్స్ తదితర భవన నిర్మాణ పనులు కూడా చేపట్టడం జరుగుతుందని అధికారులు వివరించారు.

ఈ సందర్భంగా సూపరింటెండెంట్ ఇంజనీర్ పి. అశోక్ కుమార్, ఎగ్జిక్యుటివ్ ఇంజనీర్ (మెడికల్) కే. విజయ భాస్కర్ రెడ్డి, డిప్యూటీ ఈ ఈ ఎస్. కృష్ణా రావు , డి ఎం అండ్ హెచ్ ఓ డా. స్వర్ణలత, ఆసుపత్రి సూపరింటెండెంట్ తదితులున్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *